ఇక ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్

ఇక, ఖాళీల భర్తీకై వార్షిక నియామక కేలెండర్ (జాబ్ క్యాలెండర్‌ ) విడుదల చేయాలని నిర్ణయించింది తెలంగాణ కేబినెట్‌.. ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌… సుదీర్ఘంగా ఏడు గంటలకు పైగా సాగింది.. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులు, మరియు అధికారుల కేటాయింపులు చేపట్టాల్సిందిగా టీఎన్‌జీవో, టీజీవో ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు చేసిన విజ్జప్తిని పురస్కరించుకుని అందుకు సంబంధించి కేబినెట్ చర్చించింది. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే చేపట్టాలని, ఖాళీల గుర్తింపు మరియు భర్తీ ప్ర్రక్రియ సత్వరమే జరగాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఇక, అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్ మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్ ’ ను తయారు చేయాలని అధికారులను ఆదేశించింది కేబినెట్‌.. ప్రతి సంవత్సరం ఖాళీల భర్తీకై.. ‘వార్షిక నియామక క్యాలెండర్ ను తయారు చేసి అందుకు అనుగుణంగా విధిగా భర్తీ ప్రక్రియ నిర్వహించాలని కేబినెట్ ఆదేశించింది.. ఉద్యోగ ఖాళీల భర్తీకై చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కొరకు రేపు కూడా కేబినెట్ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులను పూర్తి వివరాలతో హాజరు కావాలని కేబినెట్ ఆదేశించిన సంగతి తెలిసిందే కాదు.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-