టీఆర్ఎస్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ : బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్ర కి కేంద్ర నాయకత్వం మద్దతు పూర్తిగా ఉంది అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఈ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి పొర్లు దండాలు పెట్టడం కాదు.. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి. ఎక్కడికి వెళ్లినా ప్రజలు టీఆర్ఎస్ హామీలు గుర్తు చేస్తున్నారు అని చెప్పిన బండి సంజయ్ తెలంగాణ వచ్చిన తర్వాత విమోచన దినోత్సవం ను ఎందుకు జరపడం లేదు అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17 నిర్వహించే సభకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ వస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు నిర్మల్ రావాలి అని పిలుపునిచ్చారు.

మోదీ, అమిత్ షా లేని దేశాన్ని ఊహించలేము అని చూపిన కరీంనగర్ ఎంపీ టీఆర్ఎస్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. అక్కడ అన్ని పదవులు వారి కుటుంబానికే కావాలి అని తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మ వారి దగ్గర యాత్ర స్టార్ట్ చేస్తే రెచ్చగొట్టినట్లే. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉద్యోగాలు నోటిఫికేషన్ లు ఇస్తాము అంటారు. కానీ స్టేబుల్స్ కి జీతాలు ఇవ్వకుండా పుస్తకాలు ఇచ్చి చందాలు వసూలు చేసుకోమంటున్నారు. 273000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చాము. తెలంగాణ లో పేదలు అందరికి ఇళ్ళు ఇస్తాము అన్నారు. ఆ లిస్ట్ ఇవ్వండి నేను పీఎం మోదీ దగ్గరకి తీసుకువెళ్తాను అన్నారు.

సూర్యాపేట జెడ్పీ సీఈఓ ప్రభుత్వం కార్పొరేట్ కొమ్ము కాస్తుంది అని చెప్పాడు. రాష్ట్రంలో ఉద్యోగులు ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. మతపరమైన రిజర్వేషన్లు పంపినావు.. ఏమి అయింది. బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీ ఏం ఐఎం , వాళ్ళను ప్రోత్సహిస్తుంది టీఆర్ఎస్. తెలంగాణ లో 2023 లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక యూపీ లాగానే జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకువస్తాము అని పేర్కొన్నారు. ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు ఇదే మా నినాదం. ఏంఐఎం వాళ్ళు పోటీ చేయడం కోసం అసెంబ్లీలో బిల్లు తెద్దాం అనుకున్నారు. దమ్ముంటే ముస్లిం రిజర్వేషన్ బిల్లు పెట్టి చూడు అని చెప్పిన బండి సంజయ్ టీఆర్ఎస్ కు జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఏంఐఎం మీద పోటీ చేసే ధైర్యం లేదు అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-