తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి : బండి సంజయ్

నిన్న జరిగిన దౌర్జన్య కాండను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. రైతుల కోసం ఏ దాడులైనా భరిస్తాం. రైతుల పక్షాన పోరాడతాము అని బండి సంజయ్ అన్నారు. దాడుల్లో రైతులకే కొడుగుడ్లు తగిలాయి, రాళ్లు తగిలితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను చెప్పుకునేందుకు వస్తుంటే టీఆరెస్ భయపడుతోంది. బాధలు చెప్పుకునేందుకు వచ్చే రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. బాధ్యత యుతంగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ దాడులకు పిలుపునిస్తున్నారు. రైతుల ఇబ్బందులు ప్రశిస్తే తలలు నరుకుతావా. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి అన్నారు. మా పై జరిగే దాడుల గురించి పోలీసులకు తెలియదా. 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. కోడిగుడ్లు, రాళ్లు పడతాయని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు అని తెలిపారు.

ఇక ఖచ్చితంగా వానాకాలం పంట మొత్తం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదు. ఎనిమిది రాష్ట్రాల్లో లేని సమస్యలు ఇక్కడే ఎందుకు. కొనుగోళ్ల లో అన్నింటీకీ మేమే డబ్బులు ఇస్తున్నాం. 2022 వరకు రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీలను నిలబెట్టుకుంటాం. పథకం ప్రకారం రైతులను సతాయించి ఇబ్బందులు పెట్టి కొనుగోలు చేయాలని చూస్తోంది. రుణమాఫీ చేస్తామని చేయలేదు, ఫసల్ భీమా యోజన ఎందుకు అమలు చేయలేదు. కాళ్ళు మొక్కిన కలెక్టర్ ను ఎమ్మెల్సీ చేస్తున్నారు.. ప్రజలు,రైతులకు ఇబ్బందులు పెట్టిన వారికి పదవులా అని అడిగారు. అలాగే బీజేపీ ప్రశ్నించకుంటే ఇప్పటికైనా కొనుగోళ్లు ప్రారంభం కాకపోయేవి. మావి ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయి, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పోలీసుల బందోబస్తు, వారి సహకారంతో దాడులు చేస్తున్నారు. మాపై దాడికి స్కెచ్ వేసినప్పుడే నిన్నటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అవినీతి చిట్టా తీస్తాం, తప్పకుండా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తాము. నిన్న దాడిలో మిర్యాలగూడ ఏబీఎన్ రిపోర్టర్ మనోజ్ కు గాయాలయ్యాయి, దారుణం అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles