గోదావరి, కృష్ణ జలాలపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..

గోదావరి, కృష్ణ జలాలపై కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ జలాలపై సీఎం కేసీఆర్ వైఖరి స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.. తాము కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన.. రాబోయే రోజుల్లో ఇద్దరు సీఎంల బండారం బయట పడుతుందని వ్యాఖ్యానించారు.. రెండు రాష్ట్రాల సీఎంలు కమిషన్ ల కోసం పని చేస్తున్నారని ఆరోపించిన బండి సంజయ్.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం అడ్డుకోవడానికి కేంద్రం నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు.. తెలంగాణకి రావాల్సిన నీటి వాటా విషయంలో కేసీఆర్ పట్టించుకోవడం లేదు.. అందుకే జగన్ దోచుకుపోతున్నారన్న ఆయన.. తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అంటూ ఫైర్‌ అయ్యారు.

కృష్ణ పరివాహన ప్రాంతం 68 శాంతం ఉంటే.. తెలంగాణకి 575 టీఎంసీ నీరు రావాల్సిన ఉంటే.. 299 టీఎంసీల నీరు ఎలా ఒప్పుకున్నారంటూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు బండి సంజయ్‌.. కమిషన్‌ల కోసం పక్క రాష్ట్రంతో కుమ్మక్కయ్యారని ఆరోపించిన ఆయన.. బహిరంగంగా ఎవరి వాటా ఎంత అనేది మేం చెబుతున్న సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సీఎం లెటర్‌ రాశారు.. మరి సుప్రీంలో కేసు వేస్తే ఎలా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు అని.. ఆ కేసును కూడా 8 నెలల తరువాత వాపస్ తీసుకున్నారని తెలిపారు.. ఇక, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించిన బండి.. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ సీఎం కేసీఆర్‌కు పాల్గొనేందుకు సమయం లేదంట? వాయిదా వేయించారు అంటూ ఎద్దేవా చేశారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని.. కానీ, తెలంగాణకు అన్యాయం జరిగితే తప్పకుండా బీజేపీ అండగా ఉంటుందన్నారు.. అంత హుజురాబాద్ ఎన్నికల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రుల హైడ్రామా..? అని ఆరోపించిన ఆయన.. 299 టీఎంసీల నీరు ఎలా ఒప్పుకున్నాడని కేసీఆర్ బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-