అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు ఉద్యమిస్తున్నారు. రైతులకు సంఘీభావం ప్రకటించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో 22 రోజులుగా చేస్తున్న మహా పాదయాత్రకు ఆయన మద్దతు ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తిరుపతిలో పర్యటించిన తర్వాత రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరి తీసుకుంది. అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు షా హితబోధ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఏపీ బీజేపీ నేతలు పాదయాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ నేతలు ఇప్పటికే ఉద్యమంలో పాల్గొని మద్దతు తెలిపారు. తాజాగా బండి సంజయ్ వారికి అండగా నిలవడంతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయన రాజధాని రైతులను కలవనున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ వెళ్లి రైతుల్ని కలిసి సంఘీభావం తెలపాలని భావిస్తున్నట్టు పార్టీ నేతలకు ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.

Related Articles

Latest Articles