ఏడు రోజులు.. ఆరు బిల్లులు, 32.05 గంటలు..

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజుల పాటు జరిగాయి. మొత్తం అరు బిల్లులకు సభ ఆమోదం తెలపగా… ఆరు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మొత్తం 32 గంటల 5 నిమిషాలు సభ జరిగింది. ఆఖరి రోజు సభలో సంక్షేమ పధకాలపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వాలని కోరారు భట్టి. ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ అర్హులకు అందడం లేదని అన్నారు. కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ లు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టాక గాని రావడం లేదనీ విమర్శించింది బీజేపీ. అయితే దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌… ఎక్కడైనా తప్పు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు కేంద్రం నుంచి వచ్చే నిధులు… రాష్ట్రంలో సంక్షేమ పధకాలపై సుదీర్ఘంగా మాట్లాడారు సీఎం కేసీఆర్‌. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై కామెంట్‌ చేశారు. కేంద్రం దగ్గరే డబ్బుల్లేవ్‌… ఇక మనకేమిస్తారని అన్నారాయన. మరోవైపు ఏడాది లోపు వక్ఫ్ భూముల విచారణ ముగిస్తామని హామీఇచ్చారు సీఎం. కేసీఆర్‌ సుదీర్ఘ వివరణ అనంతరం సభ నిరవధిక వాయిదా పడింది. ఇక, యాదాద్రి టెంపుల్ నవంబర్ లేదంటే డిసెంబర్ లో ప్రారంభిస్తామని.. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీని కూడా పిలిచామని.. వస్తామన్నారని తెలిపారు.. మరోవైపు.. మేం ఒక్క ఏడాదిలో పెట్టిన మైనార్టీ బడ్జెట్ …కాంగ్రెస్ పదేళ్లలో కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు కేసీఆర్.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా సంక్షేమం కోసం మేము కాంగ్రెస్ కంటే 10 రేట్లు ఎక్కువ పెట్టామన్నారు.. చెప్పిందే చెప్పి..చెప్పి.. అన్నట్టుగా చెప్ప దలుచుకోలేదన్న ఆయన.. వ్యవసాయం రాదు.. తెలివి లేదు అన్నా ఆంధ్ర పాలకుల గురించి చూద్దాం.. సగటు ఆదాయం ఏపీకి లక్షా 72 వేలు అయితే, తెలంగాణది 2 లక్షల 32 వేలుగా వివరించారు.. అయితే, కేంద్రం నుండి పెద్దగా వచ్చింది ఏమీ లేదన్నారు.. కేంద్రం అధికారంలోకి వచ్చినప్పుడు 50 వేల కోట్లు అప్పు.. ఇప్పుడు లక్ష కోట్లు దాటిందని గుర్తిచేశారు.. కేంద్రం నిధులు అనే ముచ్చట బంద్ చేయాలని బీజేపీ నేతలకు సూచించారు.. అది మీకే నష్టం అన్నారు సీఎం కేసీఆర్.. అయితే, చాలా అంశాలపై చర్చ జరగకుండానే సభ ముంగించారని ఆరోపించింది విపక్షం.

-Advertisement-ఏడు రోజులు.. ఆరు బిల్లులు, 32.05 గంటలు..

Related Articles

Latest Articles