అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు.. ఈసారి వాడీవేడీగా..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలను వారానికి పైగా నిర్వహించాలన్న ఆలోచనతో అధికార పార్టీ ఉన్నట్టు సమాచారం. బీఏపీ సమావేశంలో చర్చించి… ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటారు. గత అసెంబ్లీ సమావేశాలు మార్చి 15న మొదలై.. 26న ముగిశాయి. ఇక, అసెంబ్లీ సమావేశాలకు అధికార, విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దళితబంధు పథకం కోసం కొత్త చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టి…ఆమోదించుకోవాలని భావిస్తోంది. దళిత బంధు పథకంపై అసెంబ్లీలో వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం ఉంది. దళిత బంధుతో పాటు మరో 5 బిల్లులను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్, ఇటు బిజెపి.. పలు అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ కూడా విపక్షాలు లేవనెత్తే ఏ అంశంపైనైనా దీటుగా జవాబిచ్చేందుకు సిద్ధమవుతోంది. మొత్తంమీద వారంపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పైచేయి సాధించేందుకు అధికార, విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి.

-Advertisement-అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు.. ఈసారి వాడీవేడీగా..!

Related Articles

Latest Articles