విభజన సమస్యలపై ఇవాళే కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారంపై దృష్టి సారించింది కేంద్రం హోంశాఖ.. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంమత్రిత్వశాఖ లేఖ రాసింది. విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై జనవరి 12న జరగనున్న సమావేశానికి హాజరు కావాలని కోరిన విషయం తెలిసింది.. అందులో భాగంగా ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమావేశం కానున్నారు. మొదట ఢిల్లీలో ప్రత్యక్షంగా ఈ సమావేశం నిర్వహించాలని భావించినా.. ప్రస్తుత పెరిగిపోతున్న కరోనా కేసుల దృష్ట్యా.. వర్చువల్‌గా ఈ సమావేశం జరగనుంది..

Read Also: అర్ధరాత్రి నుంచే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం

ఇక, ఈ సమావేశంలో చర్చించాల్సిన తొమ్మిది అంశాలను ఎజెండాలో పొందుపర్చింది కేంద్రం… విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన, విద్యుత్ బకాయిలు, ఏపీ-ఎస్​ఎఫ్​సీ విభజన, సింగరేణి కార్పొరేషన్‌తో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్ విభజన, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, విభజన చట్టంలో పొందుపర్చిన ప్రకారం పన్ను బకాయిలు, బ్యాంకు డిపాజిట్లలో మిగిలిన నగదు పంపకాల అంశాలు ఎజెండాలో పెట్టింది కేంద్ర హోంశాఖ.. వీటితో పాటు ఇతర అంశాలపైనా… విభజనచట్టంలోని హామీల అమలు, వాటి పురోగతిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.. మొత్తంగా విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశం ఆసక్తికరంగా మారింది.

Related Articles

Latest Articles