తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన…

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా ఉండగా… ఈశాన్య అరేబియా సముద్రంలో గుజరాత్ తీరానికి సమీపంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. వీటన్నిటి ప్రభావంతో దాదాపు దేశమంతటా చురుగ్గా రుతుపవనాలు. కోస్తాంధ్ర తెలంగాణల్లో రానున్న 24 గంటల్లో చెదురుమదురుగా వర్షాలు.. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. నేడు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ప్రమాదముంది. సముద్రతీరం అల్లకల్లోలంగా ఉన్నందున చేపల వేటపై నిషేధం విధించారు. రేపు తెలంగాణ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలుస్తుంది. ఈనెల 17 వరకు వర్ష ఉద్ధృతి కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-