తెలకపల్లి రవి : కేంద్ర క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో రాజకీయ సత్యాలు

రెండవసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్లతర్వాత తన మంత్రివర్గాన్ని దాదాపు సమూలప్రక్షాళన చేసిన ప్రధాని మోడీ చర్యలో స్పష్టమైన రాజకీయ సంకేతాలున్నాయి. తన ప్రభుత్వమూ బిజెపి కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నాయనే వాస్తవాన్ని ఆయన అంగీకరించారు. దీన్ని విస్తరణ మార్పు అనేకంటే తిరగనేత అనడం మెరుగు. 52మ ంది మంత్రులుంటే 43 మంది మార్పులతో సహా చేరడం 12 మందిని బయిటకు పంపించడం గతంలో ఎన్నడూ జరిగివుండదు.ఇదంతా ఎన్నికల వ్యూహంతో చేశారని బిజెపి నేతల పైకి చెప్పుకోవచ్చు గాని పరిస్థితి బాగాలేదని మోడీ ఒప్పుకోవడంగా చూడకతప్పదు. కరోనా సెకండ్‌ వేవ్‌ బీభత్సానికి ఆరోగ్య మంత్రి హర్షవర్థన్‌ను తప్పించడానికి సంబంధం లేదని చెబితే వాస్తవికంగా వుంటుందా? ఒక ప్రధాని ఏకంగా ఇంతమందినిఒకేసారి తప్పించవలసిరావడం నిస్సందేహంగా పెద్ద సవాలే.అంతా అయిపోయిందనుకున్నాక ప్రకాశ్‌ జవదేకర్‌,రవిశంకర్‌ ప్రసాద్‌లు తప్పుకోవడం చాలామందిని దిగ్భ్రాంతపరచింది.

read also : రేపు, ఎల్లుండి నిలిచిపోనున్న తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్స్

కాని అంత పెద్ద ఆపరేషన్‌ అవసరమనే మోడీ భావించారు.మోడీ, ఆయనతో పాటు భాగస్వామ్యం వహించగల ఒకేఒక్కడు అమిత్‌షా కూడబలుక్కుని తెచ్చిన కుదుపుగానే దీన్ని పరిగణించాల్సి వుంటుంది. మహిళలు మైనారిటీలు ఎస్‌సిఎస్‌టిలకు కూడా విస్త్రత ప్రాతినిధ్యం కల్పించారంటే ఇప్పటివరకూ అది లేదని సామాజిక సమీకరణలు సరైన సంకేతాలు ఇవ్వలేదని గుర్తించార న్నమాట.నలుగురు మాజీ ముఖ్యమంత్రులూ 23 మంది సీనియర్‌ ఎంపిలు 18 మంది మాజీ సహాయ మంత్రులు వచ్చినవారిలో వున్నారంటే అనుభవం కొరత ఒకవైపు,తనతో తలపడనివారిని ఎంపిక చేయాలనే సమతూకం మరోవైపు ప్రభావంచూపాయి. యుపినుంచే అత్యధిక ప్రాతినిధ్యం కల్పిస్తూ దక్షిణాదిని తమిళనాడులో ఒక్కమంత్రికే పరిమితంచేయడం, తెలంగాణనుంచి కిషన్‌రెడ్డి హోదాపెంచుతూ ఎపిని చిన్నఈశాన్య రాష్ట్రగవర్నర్‌ పదవితో సరిపెట్టడం యాదృచ్చికం కాదు. ఈ రాష్ట్రాలలో ఇంకేమీ అవకాశాలు లేవని బిజెపి అధిష్టానం నెమ్మదిగా అంగీకరిస్తున్నదన్నమాట.

పాలిచ్చే గేదెకే గడ్డి వేయాలన్నట్టు సీట్లు రాని రాష్ట్రాలకు కేంద్ర పదవులు కేటాయిం చదలు చుకోలేదు.తెలంగాణ నుంచి తమతరపున నేరుగా ఎన్నికైన ఎంపిలు వున్నా ,ఎపిలో టిడిపి నుంచి వచ్చి కలిసిపోయిన వారు వున్నా స్థానం కల్పించలేదంటే అదే కారణం.ఇక్కడహడావుడి చేసేనేతలకు ఈధోరణి ఆశాభంగమే.అయితే 2022లోయుపి పంజాబ్‌ గుజరాత్‌ ఎన్నికలలో బిజెపి అవకాశాలు ఈ మార్పులతో పెరుగుతాయా అంటే గ్యారంటీ ఏమీ లేదు. అప్పుడు మళ్లీ ఏం జరుగుతుందో చెప్పలేము. పైగా వ్యవహారాలన్నీ నడిపించే మూల విరాట్టుల వంటి మోడీ షాలు మారకుండా ఉత్సవ విగ్రహాల వంటి ఇతరులను ఎందరిని మార్చితే ఎంత ప్రయోజనం?
కేరళలో పినరాయి విజయన్‌ రెండవసారి గెలిచాక మొత్తం మంత్రివర్గాన్ని కొత్తగా తీసుకున్నారు.

ఎపిలో జగన్‌ సగం పదవీ కాలంతర్వాత మంత్రివర్గాన్ని మొత్తం మార్చేస్తామని ముందే ప్రకటించారు. ఇప్పుడు మోడీ చేసింది కూడా అలాటి ప్రయోగమే. కాస్త చిన్నవారిని తీసుకోవడంలోనూ విజయన్‌ కనిపిస్తాడు. ే ముఖ్యమైన మరో విషయమేమంటే చిన్న చిన్న మిత్రపక్షాలను కూడా కలుపుకొంటేనే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కగలమని భావించడం.అప్నాదళ్‌ నుంచి జెడియు వరకూ అందరికీ ప్రాతినిధ్యం ఇవ్వడంలో ఇదే కనిపిస్తుంది. ఇన్ని విన్యాసాలు చేయవలసి వచ్చిందంటేనే బిజెపి పాలనకు ప్రతికూలతను మోడీ ఎంత తీవ్రంగా తీసుకున్నారో అర్థమవుతుంది, అయితే ఏకపక్ష విధానాలను మార్చుకోకుండా ఎన్ని కాయకల్ప చికిత్సలు చేసినా క్షేత్రస్థాయి వాస్తవాలు మారవు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-