తెలకపల్లి రవి : మీడియా, రాజద్రోహం, సుప్రీం కోర్టు తీర్పు

మీడియాలో వార్తలు వ్యాఖ్యల ద్వారా తమ వృత్తిధర్మం నిర్వహించే పాత్రికేయులకు రక్షణ వుండాలని సీనియర్‌ జర్నలిస్టు వినోద్‌దువా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ ఆహ్వానించారు. మీడియా ప్రసారాలు ప్రచురణలపై 124(ఎ) రాజద్రోహం కేసులు మోపడంసరికాదని పేర్కొంది. పౌరులకు కూడా ప్రభుత్వాల లోపాలను వైఫల్యాలను సమస్యలను విమర్శించే హక్కు వుంటుందని కూడా ఆ తీర్పులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పుల్వామాలో ఉగ్రవాదుల వేటుకు, బాల్‌కోట వైమానిక దాడికి ఇచ్చిన ఉద్వేగ ప్రచారం ఇప్పుడు కరోనా కట్టడిలో వైఫల్యం వంటివాటిని సూటిగా విమర్శించినందుకే వినోద్‌దువాపై ఈ సెక్షన్‌ బనాయించారు.పద్మశ్రీపురస్కార గ్రహీత అయిన వినోద్‌ యు ట్యూబ్‌ చానల్‌లో చేసిన వ్యాఖ్యలపై శ్యాం అనే బిజెపి నాయకుడు సిమ్లాజిల్లాలో కేసు పెట్టారు. ప్రభుత్వాలు తమతో ఏకీభవించిన జర్నలిస్టులపైన మీడియా ప్రసారాల పైన కేసులు పెట్టి వేధించడంపరిపాటి అయిందని వినోద్‌ దువా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈ కేసును విచారించిన జస్టిస్‌ యుయు లలిత్‌ ధర్మాసనం జర్నలిస్టుల స్వేచ్చకు రక్షణ వుంటుందని ప్రకటించింది. హింసను ప్రేరేపించడం ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వానిన పడగొట్టాలని ప్రయత్నించడం మాత్రమే రాజద్రోహమని1962లో కేదార్‌నాథ్‌సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ కేసులో సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం పాత్రికేయులందరికీ రక్షణ వుండాల్సిందేనని ప్రకటించింది, 2020 మార్చినాటి పరిస్థితుల్లో వలస కార్మికుల దుస్థితి వాస్తవమనీ వాటిపట్ల వ్యాకులతతో ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తూ పరిష్కార చర్యలు తీసుకోవాలిన వినోద్‌ దువా కోరడం ఏ విధంగానూ తప్పు కాదని కోర్టు స్పష్టం చేసింది. అంతకు కొద్ది రోజుల ముందే తెలుగు ఛానళ్లుదాఖలు చేసిన పిటిషన్‌లోనూ సుప్రీం కోర్టు 124(ఎ)ను మరోసారి సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం వుందని తెల్పింది.దీంతోపాటే భారత శిక్షాసృతి(ఐపిసి) సెక్షన153(ఎ) వివిధ తరగతుల ప్రజల మధ్య వైషమ్య వ్యాప్తి, 505 ప్రజాజీవితంలో కల్లోలసృష్టి అనే నిబంధనలను కూడా మీడియా కోణంలో మళ్లీ పరిశీలించాల్సి వుందని చెప్పింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 30న న్యాయస్థానం ఇచ్చిన ఒక తీర్పులో కరోనా నేపథ్యంలో కోవిడ్‌ కట్టడికి సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను మీడియాలో నివేదించినందుకు విమర్శించినందుకు కేసులు బనాయించడం సరికాదని కోర్టు చెప్పింది,1890నాటి రాజద్రోహచట్టం, 1910లో బ్రిటిష్‌పత్రికా చట్టం 1917లో రౌలట్‌ చట్టం ఇవన్నీ పరాయి ప్రభుత్వం దేశ ప్రజలస్వాతంత్రోద్యమాన్ని అణచివేయడానికి తెచ్చినవే.వాటినే ఐపిసి124(ఎ) ఆ అంశాలకే ప్రతిరూపం, వాటిని ఇంకా కొనసాగిస్తూ ఇప్పుడుసోషల్‌ మీడియాపైనా అదే దాడి చూస్తున్నాం. ఐపిసి124(ఎ)లో ఏం వుంది?:ఎవరైనా సరే తమ మాటల ద్వారా గాని మౌఖికంగా లేదా లిఖిత పూర్వకంగా సంజ్ఞలు లేదా ప్రత్యక్ష వ్యక్తీకరణల ద్వారా గాని మరో విధంగా గాని విద్వేషంలేదా ధిక్కారం వ్యాప్తి చేసేట్టయితే భారత దేశంలో చట్టం ద్వారా స్థాపితమైన ప్రభుత్వం పట్ల అయిష్టతను విముఖతను రెచ్చగొట్టేట్టయితే ప్రేరేపించేట్టయితే వారికి కారాగారశిక్షకు పాత్రులగుదురు’ ఈ కారాగారశిక్ష మూడేళ్ల నుంచియావజ్జీవం వరకూ వుండొచ్చు.

రెండూ కలిసి కూడా వుండొచ్చు. ప్రభుత్వ విధానాలను చట్టంద్వారా మార్చడానికి ప్రయత్నిస్తే అది రాజద్రోహం కాదు.ద్వేషం ధిక్కారం ప్రేరేపించే వ్యాఖ్యలు కూడా రాజద్రోహం కాదని వివరణలు,చెబుతున్నాయి. కాేని ఆచరణలో మాత్రం దీన్నివిచక్షణా రహితంగా ప్రయోగిస్తూనే వున్నారు. ఉదాహరణకు ,కేరళకు చెందిన జర్నలిస్టు సిద్దిక్‌ కప్పన్‌ యుపిలోని హత్రాస్‌లోదళిత బాలిక అత్యాచారానికి గురైన దారుణఘటనకు సంబంధించి వివరాల సేకరణ కోసం వెళితే ఈ కేసు పెట్టారు రైతుల ఆందోళనను బలపర్చినందుకు గాను బెంగుళూరులోదిశారవి అనే పర్యావరణ కార్యకర్తపైన 124 ఎ మోపారు.ఇదే ఆందోళనకు సంబంధించి రిపబ్లిక్‌ దినోత్సవంనాడు జరిగిన ఘటనల వెనక వాస్తవాలు వెల్లడిరచినందుకు గాను రాజ్‌దీప్‌ సర్దేశాయి, వినోద్‌జోష్‌, జఫర్‌ఆఘా, పరేశ్‌నాథ్‌,అనంతనాథ్‌ తదితరులపై రాజద్రోహం కేసులే పెట్టారు, సుప్రీం కోర్టు వారిని అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాల్సివచ్చింది,

2014లో 47,2015లో 30,2016లో 35,2015లో 51,2018 లో 70,2019లో 93 రాజద్రోహం కేసులు నమోదవడం, సంబంధిత వ్యక్తులు విచారణ లేకుండా ఖైదులో మగ్గిపోవడం వేధింపులకు గురవడం జరుగుతున్నది.కాని అంతిమంగా శిక్షలు పడే శాతం చాలా నామమాత్రం, 2016,17లలో లో ఒక్కొక్కరిక,2018లోఇద్దరిక,2019లోముగ్గురికి మాత్రమే విచారణలో నేర నిర్దారణ జరిగింది, అదైనా ఏ మేరకు ఏ పద్దతిలో జరిగిందనేది పరిశీలించవలసిందే, ఒక్క యుపిలోనే హత్రాస్‌ ఘటన తర్వాత సిద్దిక్‌ కప్పన్‌తో పాటు మొత్తం 22 మందిపై 124(ఎ) కింద కేసులు పెట్టారు.దీంతోపాటే మణిపూర్‌ వంటిచోట్ల జాతీయ భద్రతా చట్టం(నాసా)ను కూడా ప్రయోగించారు, వాస్తవానికి ప్రభుత్వ వైఖరితో విబేదించినంతమాత్రాన రాజద్రోహం అనడం సరికాదని 2018లో లాకమిషన్‌ స్వయంగా వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాపితంగా అత్యధిక దేశాలు ఈ రాజద్రోహం వంటి నిబంధనలకు స్వస్తిచెప్పేశాయి.

మారిన పరిస్తితులలో తమ కోణంలో దేశభద్రత టెర్రరిజం నిరోధం వంటి చట్టాలు చేసుకున్నాయి,మన దేశంలో నాసా,ఉసా వంటి చట్ట్లాలు ఆ విధంగా చేసినవే అయినా వాటినీ విపరీతంగా దుర్వినియోగ పరుస్తున్నారు. ఈ సమయంలో భీమ్‌ కోర్‌గావ్‌ కుట్ర పేరిట వయోవృద్ధులైన వరవరరావు స్టాన్‌స్వామి వికలాంగుడైనప్రొఫెసర్‌ సాయిబాబ, పలువురు మహిళా కార్యకర్తలు కూడా ఖైదులో మగ్గిపోతున్నారు. పౌరులకు రాజకీయ పక్షాలకు ప్రజాసంఘాలకు ప్రభుత్వాల తప్పిదాలపై పోరాడే హక్కు వుందంటూనే కర్కశ చట్టాలతో కటకటాలపాలు చేయడం అత్యంత అప్రజాస్వామికం,
వినోద్‌ దువా విషయంలో అరెస్టు చేయరాదని(బలప్రయోగంవద్దని)చెప్పడం రాజద్రోహం 124(ఎ)సెక్షన్‌ను లోతుగా పరిశీలించి సమీక్షించాలని చెప్పడం మినహా మొత్తంగా ఎత్తివేయాలని నిర్దేశించలేదుౖ ఎప్‌ఐఆర్‌ నమోదును కూడా ఖండిరచలేదు,

చీప్‌జస్టిస్‌ ఎన్‌వి రమణ హయాంలో ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తున్నట్టు చెబుతున్నారు గనక మౌలికంగానే మార్పుల అవసరాన్ని గుర్తించడం అవసరం,పదేళ్ల పైబడిన సీనియారిటీ వున్న జర్నలిస్టులకు సంబంధించిన కేసులలో తగు సమీక్ష తర్వాతనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావాలని వినోద్‌ దువా కోరారు. అందుకు అంగీకరించలేమని అది చట్టసభల పరిధిలో అంశమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.124(ఎ)పునర్ధర్శనం పున:పరిశీలన వంటి మాటలు ఏంచెప్పినా అవి వెంటనే అమలుకు వచ్చేవి కావు. ఐపిసిని పార్లమెంటు సవరిం చేవరకూఅలాగే వుంటాయి. మీడియాలో పొరబాటు ధోరణులను సవరించుకోవలసిందే గాని తమకువంతపాడలేదనిపాలకులు వాటి స్వేచ్చాస్వాతంత్రాలను కాలరాచివేయడం సరికాదు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-