తెలకపల్లి రవి : సినారె.. భళారే!

సాహిత్యస్పూర్తి, సమయస్పూర్తి, సభాస్పూర్తి, స్నేహ స్ఫూర్తి కలబోసుకున్న స్పురద్రూపి సినారె. రాతకూ కూతకూ పాటకూ మాటకూ కలానికి గళానికి సరిహద్దులు చెరిపేసిన వారు. ‘నిలకడగా వున్న నీళ్లలో కమలాలే కాదు, క్రిములూ పుడతాయి’ అని రాసిన సి.నారాయణరెడ్డి నిజంగానే చలనశీలంగా బతికారు, కొన్నేళ్ల కిందట త్యాగరాయ గానసభ వేదికపై ఆ చరణాలు చెప్పి తన కవిత్వం ప్రవాహ గుణ ప్రధానమని వర్ణిస్తే నన్ను మెచ్చుకున్న సినారె సభలో పాల్గనని రోజు వుండేది కాదు. ఇంత సభా సంచారంలోనూ కూడా నిత్య కవితా రచన!‘ ఊపిరాడ్డం లేదు, ూక్కపోస్తుంది నాకు ఏసి గదిలో.. కారణం తెలిసి పోయింది.. కవిత్వం రాయలేదు..’ అన్నది ఆయన తపస్సు. ప్రతి పుట్టిన రోజునా ఒక సంపుటి. ఆయన ఆప్యాయంగా అందంగా సంతకం చేసి ఇచ్చిన అనేక సంపుటాలు ఇందుకు నిదర్శనంగా నాదగ్గరున్నాయి. 85వ జన్మ దినోత్సవాన కవితా సంపుటం వెలువరించిన వారెందరున్నారో పరిశోధకులు చూసుకోవచ్చు.

ఎన్టీఆర్‌ పిలుపుపై ‘నన్నుదోచుకుందువట’ే అంటూ సినిమా జగత్తులో ప్రవేశించిన సినారె ‘రవ్వంత సడిలేని రసరమ్య గీతాల’తో అందరినీ దోచుకున్నారు. ‘పగలే వెన్నెల’ కాయించారు. ‘అ అమ్మ ఆ ఆవు’ అంటూ అక్షరాభ్యాస గీతాలు రాసి అలరించిన ఆయన ‘చదవులతో పనిఏమి హృదయమున్నచాలు’ అని అవిద్యావంతులనూ ఓదార్చారు. ‘అనగనగా ఒకరాజు’ అంటూ కొడుకుల అనాదరణచూసిన పెద్దమనిషిపై పాట కట్టిన ఆయన ‘అనుబంధం ఆత్మీయత’ అంతా ఒక బూటకం అంటూ మానవ సంబంధాల విచ్చిన్నాన్ని గానం చేశారు. ‘మనసున్న మనిషికి సుఖము లేదంతే’ అని ఆత్రేయ శోకిస్తుంటే ‘మనసే మనిషికి తీయని వరమూ’ అని సినారె ఆశాభావం చాటారు. మరింత బలంగా ‘గోరంతదీపం కొండంత వెలుగుచిగురంత ఆశ జగమంత వెలుగు’ అని రాశారు. ‘గాలికి కులమేది’ అని ప్రశ్నించారు.. ‘స్నహమేరాజీవితం’ అంటూ కవ్వాలిని అద్భుత సందేశంతో తెలుగీకరించారు. కృష్ణ కుచేల గాథను ఆధునిక హరికథగా మలచి వుర్రూతలూపారు. ‘వందేమాతర గీతం వరసమారుతున్నదని’ హెచ్చరించారు. సిన్ని ఓ సిన్ని అని కోనసీమ పాటనూ ఒసే రాములమ్మ అంటూ తెలంగాణ గొంతును ఇది రాయలసీమ గడ్డ అంటూ సీమ స్వరాన్ని కూడా కవికట్టారు.


అలనాటి హైదరాబాద్‌ రాష్ట్రంలో తెలంగాణ రచయితల సంఘం బాధ్యుడుగా మొదలై తర్వాత అభ్యుదయ రచయితల సంఘం వరకూ పనిచేసిన సినారీె కడవరకూ ప్రగతిశీల ప్రజాస్వామ్య వాది.. సోవియట్‌ విచ్చిన్నం తర్వాతా ‘పైనున్న మంచు కరిగినా పర్వతం కరిగిపోదు’అని ఆశయాల ఆజేయత్వాన్ని చాటారు. అర్థం కాని వారికోసం ‘ఎవడురా కూసింది కమ్యూనిజం చచ్చిపోయిందని.. మనిషి రక్తం ఎర్రగా వున్నంత వరకూ అది అజేయం’ అని మరింతసూటిగా చెప్పారు. పచ్చదనాన్ని నిషేదించాలనుకున్న రాజుగారి భంగపాటుపై పాట రాశారు. గద్దర్‌పై హత్యాప్రయత్నం జరిగితే డొక్క కడుపులో పొడిచారని అభిశంసించారు. తెలుగు జాతి మనది ‘నిండుగ’ వెలుగు జాతి మనది అని, ‘రెండుగ’ వెలుగు జాతి మనది అని ఆయా సందర్బాలలో తన హృదయ స్పందనను అందంగా పొందించారు.
సి.నారాయణరెడ్డి వంటి బహుముఖ ప్రతిభా వంతులు సవ్యసాచులూ చాలా చాలా అరుదు. ‘నా కవిత్వం చాలా మందిని ఇన్‌స్పైర్‌ చేసిందని నాకు తెలుసు. నా జీవిత చరిత్రకు ఆ శక్తి లేదేమో’ నని మహాకవి శ్రీశ్రీ అనంతంలో రాసుకున్నారు. కాని సినారె జీవిత, వ్యక్తిత్వాలు తన సాహిత్యోధృతికి తీసిపోవు. కవులంటేనే ఆవేశంతో పాటు ఆరాచకం అవిభాజ్యమనే భావన ఆయన పూర్వపక్షం చేశారు. ఎన్టీఆర్‌ ఏఎన్నార్‌లు చిత్రరంగంలో క్రమశిక్షణ తెచ్చారని అంటుంటారు. సాహిత్య రంగంలో ఆ విధమైన క్రమ శిక్షణ , శ్రమ శిక్షణ కూడా తీసుకువచ్చింది నా ఉద్దేశంలో సినారె. సృజనకారులకు రచనా శక్తి తప్ప నిర్వహణా దక్షత వుండదనే అంచనాలూ పటాపంచలు చేస్తూ అనేకానేక బాధ్యతలు నిర్వహించారు.

‘వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా’ అని ఘంటాపథంగా చెప్పిన సినారెకు ఉర్దూ హిందీ కూడా కరతలామలకమే. విస్తారంగా రాస్తూనే వున్నారు గనక భాషా పరమైన ప్రయోగాలు మరెన్నో చేయడానికి అవకాశం ఏర్పడిరది. సినారె కవితా చరణాలు, చలన చిత్ర గీతాలూ, ప్రసంగ పద విన్యాసాలు వాటికవే పాఠాలుగా వుంటాయి. బుక్‌ కల్చర్‌ పోయి లుక్‌ కల్చర్‌ వచ్చింది అనే ఆయన వాక్యానికి కిక్‌ కల్చర్‌ కిక్‌బ్యాక్‌ కల్చర్‌ వచ్చింది అని జోడిస్తే మహానందపడిపోయారు. ప్రజాశక్తి బుక్‌హౌస్‌ ప్రారంభానికి వచ్చిన ఒక మంత్రి గారు ‘ఇక్కడ విశ్వరంభ లాటి చాలా పుస్తకాలు చూశాను’ అన్నారు. తర్వాత మాట్లాడిన సినారె ‘ ఇక్కడ అన్ని రకాల మంచి పుస్తకాలు వున్నాయి. విశ్వంభరలు వున్నాయి.. విశ్వరంభలు లేవు’అనగానే చప్పట్లు! ఇరవై ఏండ్ల కిందట జ్ఞానపీఠం వచ్చినప్పుడు ‘అరిస్తే’ గొంతు పోతుందంటారు. ‘అణిసే’్త కూడా పోతుంది.. పురస్కారంతర్వాత సంతోషం గొప్పగా ప్రకటించకుండా వినయంనటిస్తూ మాట్లాడుతుంటే గొంతు పోయింది.అన్నారు.

‘ఈ పురస్కారంకోసం గతంలో నేనే స్వయంగా శ్రీశ్రీ ఆరుద్రల పేర్లు ్ల ప్రతిపాదించాను. కేంద్రం అంగీకరించలేదు.ఏం చేస్తాను..ఇప్పుడు నాకు వచ్చింది అనిచెప్పడం తన నమ్రత, సినారీె కడవరకూ ప్రజాస్వామ్య వాది.. సోవియట్‌ విచ్చిన్నం తర్వాతా ‘పైనున్న మంచు కరిగినా పర్వతం కరిగిపోదు’అని ఆశయాల ఆజేయత్వాన్ని చాటారు.అర్థం కాని వారికోసం ‘ఎవడురా కూసింది కమ్యూనిజం చచ్చిపోయిందని.. మనిషి రక్తం ఎర్రగా వున్నంత వరకూ అది అజేయం’ అని మరింతసూటిగా చెప్పారు.పచ్చదనాన్ని నిషేదించాలనుకున్న రాజుగారి భంగపాటుపై పాట రాశారు.తెలుగు జాతి మనది ‘నిండుగ’ వెలుగు జాతి మనది అని, ‘రెండుగ’ వెలుగు జాతి మనది అని ఆయా సందర్బాలలో తన హృదయ స్పందనను అందంగా పొందించారు.
ప్రాచీన కావ్యాలకే పరిమితమైన తెలుగు పరిశోధనను సమగ్ర ఆధునికత వైపు మరల్చిన అగ్రగామి ఆయన.

ఆధునిక ఆంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అన్న పరిశోధనతో ఆయనకు వొక్క పిహెచ్‌డి వచ్చింది గాని దానివల్ల వందలమంది డాక్టరేట్లు పొందారన్నది సాహిత్యలోకంలో నానుడి. 70,80 దశకాలలో దిగజారుతున్న దేశ పరిస్థితులలో మధ్యతరగతి మధనానికి సినారె కవితలు అద్దం పడతాయి. మంటలూ మానవుడు, మధ్యతరగతి మందహాసం, మట్టి మనిషి ఆకాశం వంటి పేర్లే అందుకు సంకేతాలు. మానవుల చిరంతన ఘర్షణకు సంకేతమైంది విశ్వంభర. శృంగార ప్రధానంగా గాక సామాజిక మానవీయ కోణాలతో రూపొందిన తెలుగు గజల్స్‌ అచ్చంగా ఆయన సృష్టి. పెద్ద వయసులోనూ వాటిని తనే మృదు మధురంగా ఆలపించి అభిరుచి చాటుకున్నారు. సినారె బళారె అన్నిట్లో హుషారె అంటూ శ్రీశ్రీ నలభై ఏళ్ల కింద ఒకింత వ్యంగ్యంగా అన్న మాటలు కాలం నిరంతరం నినదిస్తుంది. ‘తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి’ అని ఒక పాటలో ఆయనే రాసినట్టు తెలుగు వారి గుండెల్లో సినారె చిరస్థాయిగా నిలిచివుంటారు

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-