“ఇష్క్”ట్రైలర్… రన్ టైం ఎంతంటే ?

తేజా సజ్జా, వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ కలిసి నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా “ఇష్క్ : ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ”. ఎస్ఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో దాదాపు 7 సంవత్సరాల ఆర్‌బి చౌదరి అతని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ తో తిరిగి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ప్రశంసలు పొందిన మలయాళ రొమాన్స్ థ్రిల్లర్ “ఇష్క్”కు ఈ చిత్రం అధికారిక రీమేక్. జూలై 30న థియేటర్లలోకి రానుంది. తాజా అప్‌డేట్ ప్రకారం తేజా సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన “ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ” ఫైనల్ ఎడిట్ తర్వాత వచ్చిన రన్ టైం ఎంతో తెలిసిపోయింది.

Read Also : “తిమ్మరుసు” వేడుకకు అతిథిగా నేచురల్ స్టార్

“ఇష్క్” రన్-టైమ్ కేవలం 1 గంట 55 నిమిషాలు. మలయాళ ఒరిజినల్ నుండి 20 నిమిషాల వ్యవధిలో ఉండే కొన్ని సన్నివేశాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ఉండబోతోందని హామీ ఇచ్చింది. తేజా సజ్జా చివరగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన “జోంబీ రెడ్డి”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-