త‌ల్లిదండ్రుల‌పై కోపంతో ఆరేళ్లుగా ఆ యువ‌కుడు…

పిల్ల‌ల‌పై తల్లిదండ్రులు కోప్ప‌డ‌టం స‌హ‌జ‌మే.  తిట్టిన‌పుడు పిల్లలు అలుగుతారు.  కొంత‌మంది పిల్ల‌లు ఇంట్లోనుంచి చెప్ప‌కుండా బ‌య‌ట‌కు వెళ్లిపోతుంటారు.  కానీ, స్పెయిన్ కు చెందిన కాంటో అనే యువ‌కుడు కొంత వినూత్నంగా చేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాడు.  2012లో కాంటోని ట్రాక్ సూట్ వేసుకొని బ‌య‌ట‌కు వెళ్లొద్ద‌ని మంద‌లించార‌ని, పెర‌ట్లో గుహ త‌వ్వ‌డం మొద‌లు పెట్టాడు.  స్కూల్ నుంచి వ‌చ్చిన త‌రువాత కూడా ఆ గుహ‌ను త‌వ్వడం చేస్తుండేవాడు.  కొన్ని రోజుల త‌రువాత అతనికి త‌న స్నేహితుడు ఓ డ్రిల్ మిష‌న్‌ను ఇవ్వ‌డంతో గుహ‌ను త‌వ్వ‌డం ఈజీ అయింది.  గుహ‌లోనే లివింగ్ రూమ్‌, బాత్‌రూమ్‌, టాయిలెట్ రూమ్, ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం అన్ని ఏర్పాటు చేసుకున్నారు.  ఎక్కువ స‌మ‌యం ఆ గుహ‌లోనే గ‌డుపుతున్నాడు.  ఇప్పుడు ఆ గుహ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-