రాముల‌వారి కంట క‌న్నీరు… ఆందోళ‌న‌లో భ‌క్తులు…

విగ్ర‌హాలు పాలు తాగ‌డం, విభూతి రాల్చ‌డం వంటి వాటి గురించి గ‌తంలో విన్నాం.  వాటిపై వ‌చ్చిన క‌థ‌నాలు చ‌దివాం.  కంచిలోని న‌ట‌రాజ స్వామి వారి ఆల‌యంలోని విగ్ర‌హానికి చెమ‌ట్లు పడుతుంటాయ‌నే సంగ‌తి ఆ దేవాల‌యాన్ని ద‌ర్శించిన భ‌క్తుల‌కు తెలుసు.  అలా ఎందుకు జ‌రుగుతుంద‌నేది ర‌హ‌స్యం.  ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు.  కాగా, ఇప్పుడు ప్ర‌కాశం జిల్లాలోని కొన‌క‌మిట్ల మండ‌లంలో మున‌గ‌పాడు గ్రామంలో రామాల‌యం ఉంది. ఆ ఆల‌యంలోని రాముల‌వారి విగ్ర‌హం కంటి నుంచి నీరు కారుతున్న‌ది.  

Read: రియ‌ల్ గ‌జ‌నీ… ప్ర‌తి ఆరు గంట‌ల‌కోసారి…

గ‌ర్భ‌గుడిలోని రాముల‌వారు, సీతాదేవి, ల‌క్ష్మ‌ణుడు, హ‌నుమంతుని విగ్ర‌హాల నుంచి క‌న్నీరు కారుతుండ‌టంతో గ్రామంలోని ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందారు.  ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు క‌న్నీరు కారుతూనే ఉన్న‌ద‌ని, రాత్రి పూజ‌లు పూర్తైన త‌రువాత క‌న్నీరు ఆగిపోయింద‌ని, గ్రామంలో ఆల‌యాన్ని నిర్మించి వందేళ్లు దాటిపోయిందని, క‌రోనా కార‌ణంగా గ‌త రెండేళ్లుగా రామాల‌యంలో క‌ళ్యాణం నిర్వ‌హంచిక‌పోవ‌డం వ‌ల‌నే ఇలా జ‌రిగి ఉండొచ్చని ఆల‌య నిర్వాహ‌కులు చెబుతున్నారు.  

Related Articles

Latest Articles