మెనీ ఫెస్టివల్స్… వన్ లవ్… “రాధేశ్యామ్” న్యూ పోస్టర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. తాజాగా ఈ చిత్రం నుంచి ఉగాది స్పెషల్ గా ప్రభాస్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ స్టైలిష్ అవుట్ ఫిట్ లో నవ్వుతూ హ్యాండ్సమ్ గా కన్పిస్తున్నారు. అయితే ‘రాధేశ్యామ్’ అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిన్న గ్లిమ్స్ వదిలిన మేకర్స్ మళ్ళీ ఇప్పటికి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఇటీవలే ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘నిద్రలే’ యూవీ క్రియేషన్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఉగాది సందర్భంగా ‘రాధేశ్యామ్’ టీం ప్రభాస్ పోస్టర్ ను విడుదల చేయడం ఆయన అభిమానులు సంతోషించే విషయమే. కాగా 1960ల నాటి వింటేజ్‌ లవ్ స్టోరీగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తోంది. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్‌టెల్‌ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ పాన్ ఇండియా లవ్ స్టోరీ.

Related Articles

Latest Articles

-Advertisement-