లాస్ ఏంజెల్స్ నుంచి ‘లైగర్’ టీం హలో

“లైగర్ టీం లాస్ ఏంజెల్స్ లో ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే యూఎస్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ బృందం ఇంకా అక్కడే ఉండి లాస్ ఏంజెల్స్ అందాలను ఆస్వాదిస్తోంది. తాజాగా ఈ టీం లాస్ ఏంజెల్స్ నుంచి హలో చెప్పింది. ఈ మేరకు నిర్మాత ఛార్మి చిత్రబృందం కలిసి ఉన్న ఓ పిక్ ను పంచుకుంటూ లాస్ ఏంజెల్స్ లో ఉన్నట్టు వెల్లడించింది. ఈ పిక్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి ఉన్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : సల్మాన్ అభిమానుల పిచ్చి పీక్స్… థియేటర్లో చేయాల్సిన పనేనా ఇది ?

‘లైగర్’ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా, మైక్ టైసన్, అనన్య పాండే కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత రెండు వారాలుగా యూఎస్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్‌ ను ఇటీవలే పూర్తి చేశారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా యూఎస్‌లోని లాస్ వెగాస్‌లో తాజా షెడ్యూల్‌ను ముగించిందని అనన్య పాండే రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్న బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌తో తారాగణం అక్కడ షూట్ చేసింది. ఇక్కడే ఓ సాంగ్ ను కూడా చిత్రీకరించినట్టు సమాచారం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రం “లైగర్” పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

Related Articles

Latest Articles