ముంబైలో లాండ్ అయిన ‘లైగర్’ గ్యాంగ్!

మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ తాజా షెడ్యూల్ త్వరలో మొదలు కాబోతోంది. దీని కోసం చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శక నిర్మాత పూరి జగన్నాథ్, చిత్ర నిర్మాణ భాగస్వామి ఛార్మి స్పెషల్ ఛార్టెడ్ ఫ్లైట్ లో ముంబై వెళ్ళారు. శుక్రవారం వరంగల్ లో జరిగిన పూరి తనయుడు ఆకాశ్ ‘రొమాంటిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడానికి వచ్చిన వీరంతా శనివారం తిరిగి ముంబై చేరడం విశేషం. ఈ సందర్భంగా చాపర్ ఫ్లైట్ ఎక్కుతున్న దృశ్యాలను ఛార్మి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Read Also : ‘పెద్దన్న’ టీజర్‌ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్

తదుపరి షెడ్యూల్ కోసం ‘లైగర్’ గ్యాంగ్ ముంబైలో ల్యాండ్ అయినట్టు ఆమె అందులో పేర్కొన్నారు. యాక్షన్ మూవీ ప్రియులకు, బాక్సింగ్ అభిమానులకు ఐఫీస్ట్ గా ఉండబోతున్న’లైగర్’లో మైక్ టైసన్ నటిస్తుండటంతో ఈ మూవీకి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో రూపొందిస్తున్నారు.

Related Articles

Latest Articles