ఐసీసీ అవార్డు రేసులో టీమిండియా యువ క్రికెటర్

టీమిండియా యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. టెస్టు ఫార్మాట్‌కు సంబంధించి ఐసీసీ ప్రతి నెల ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. గత ఏడాది డిసెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్రకటించిన షార్ట్ లిస్టులో టీమిండియా నుంచి మయాంక్ అగర్వాల్, న్యూజిలాండ్ నుంచి అజాజ్ పటేల్, ఆస్ట్రేలియా నుంచి మిచెల్ స్టార్క్ ఉన్నారు.

Read Also: రాహుల్ కెప్టెన్సీ వల్లే టీమిండియా ఓడిపోయింది: గవాస్కర్

న్యూజిలాండ్‌పై స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో మయాంక్ అగర్వాల్ అద్భుతంగా రాణించాడు. రెండు మ్యాచ్‌లలో 69 సగటులతో 276 పరుగులు చేశాడు. ముఖ్యంగా ముంబై వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 150, రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. మరోవైపు ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి టెస్టులో కూడా మయాంక్ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేయడమే కాకుండా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం అందించాడు.

Related Articles

Latest Articles