ముగిసిన తొలి రోజు ఆట.. దక్షిణాఫ్రికా 35/1

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా మార్కరమ్ (7) వికెట్ కోల్పోయి 35 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ 11, కీగన్ పీటర్సన్ 14 క్రీజులో ఉన్నారు. అంతకుముందు టీమిండియా 202 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బ్యాటింగ్ చేసేందుకు తడబడింది.

కెప్టెన్ కేఎల్ రాహుల్ (50), రవిచంద్రన్ అశ్విన్ (46) మినహా మరెవరూ రాణించలేకపోయారు. వీరిద్దరూ సఫారీ బౌలర్లను ఎదురొడ్డి పరుగులు రాబట్టారు. చతేశ్వర్ పుజారా(3), రహానే (0) దారుణంగా విఫలమయ్యారు. మయాంక్ అగర్వాల్ 26, హనుమ విహారి 20, పంత్ 17, షమీ 9, బుమ్రా 14 పరుగులు చేశారు. లోయరార్డర్ లో రవిచంద్రన్ అశ్విన్ 46 పరుగులు చేయకుంటే భారత జట్టు ఇంకా తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేది. కాగా వరుసగా పుజారా, రహానే విఫలమవుతున్నప్పటికీ వారు జట్టు లో చోటు దక్కించుకోవడంపై అభిమానులు మండిపడుతున్నారు.

Related Articles

Latest Articles