టీమిండియాకు ఏమైంది? ఎందుకిలా ఆడుతున్నారు?

మొదటి రెండో టెస్టు వరకూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది మన భారత బ్యాట్స్ మెన్ యేనా? అంతగా విరుచుకుపడ్డ వీరు మూడో టెస్ట్ నుంచి ఇలా అయిపోయిరేంటి? ఎందుకిలా పేకమేడలా కుప్పకూలుతున్నారు? అసలు మన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు ఏమైంది. పట్టుమని 10 పరుగులు చేయడానికి ఎందుకింతలా ఆపసోపాలు పడుతున్నారు? ప్రపంచ క్రికెట్లో భారత ప్లేయర్లకు మంచి గుర్తింపు ఉంది. మనోళ్లు బ్యాట్ పట్టారంటే ఫోర్లు.. సిక్సర్లు.. రన్సే రన్స్ అన్న లెవల్లో చెలరేగి పోతుంటారు. అయితే మన ఆటగాళ్లకు ఓ వీక్ నెస్ ఎప్పటి నుంచో ఉంది. అది ఆఫ్ స్టంప్ ఆవల ఊరించే బంతులు వేస్తే చాలు వాటిని వేటాడుతూ అవుట్ అవడం… తాజాగా ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఈ సంఘటనే తరుచూ కన్పించడం భారత అభిమానులకు చిరాకు తెప్పిస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ చూస్తున్నంత సేపు భారత వికెట్లను తీయడానికి ఇంగ్లాండ్ బౌలర్లు పెద్దగా కష్టపడడం లేదు. ఆఫ్ స్టెంట్ బంతులను వేటాడే క్రమంలోనే మన బ్యాట్స్ మెన్లు ఈజీగా ఇంగ్లాండ్ బౌలర్లకు వికెట్లు పారేసుకొని వరుసబెట్టి అందరూ పెవిలియన్ బాటపట్టారు. ఓవల్ లో జరుగుతున్న ఈ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో సగటు స్కోరు 348 పరుగులైతే అతికష్టం మీద మన కోహ్లీ సేన 191 పరుగులు చేసింది. అది చివర్లో బౌలర్ అయిన శార్ధుల్ ఠాకూర్ దంచి కొట్టి ఆఫ్ సెంచరీ చేయబట్టి అవమానం తప్పి ఆ మాత్రం స్కోరైనా సాధించింది.

ఇంగ్లాండ్ బౌలర్లు భారత ప్లేయర్ల బలహీనతను పరీక్షిస్తూ ఆఫ్ స్టంట్ లొగిలిలో సరైన లెంగ్త్ తో బంతులు వేశారు. ఇక చెప్పేదీ ఏముంది? మన బ్యాట్స్ మెన్స్ వరుసబెట్టి వికెట్టు సమర్పిం చుకున్నారు. ఈ సిరీసులో మెరుగ్గా రాణిస్తున్న రోహిత్ తొలుత ఇంగ్లాండ్ బౌలర్ల ఉచ్చులో ఇరుకున్నాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడి అదనపు బౌన్స్ తో వచ్చిన బంతిని ఆడేక్రమంలో వికెట్ కీపర్ కు దొరికిపోయాడు. అలాగే పేలవమైన ఫామ్ లో ఉన్న పూజారా మరోసారి విఫలమయ్యాడు. దీంతో అతడి స్థానం ఈ టెస్టు తర్వాత జట్టులో ప్రశ్నార్థకంగా మారడం ఖాయమంటున్నారు.

బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన జడేజా సైతం ఆఫ్ స్టంప్ ఉచ్చులోపడి వికెట్ సమర్పిం చుకున్నాడు. ఇక మూడో టెస్టులో ఆఫ్ స్టంప్ అవల పడ్డ బంతికే వికెట్ సమర్పించుకున్న కోహ్లీ ఈ మ్యాచులో వాటి జోలికి వెళ్లలేదు. కవర్ డ్రైవ్ లు చేస్తూ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత తనలోని బలహీనతను మరోసారి బయటపెట్టుకొని వికెట్ సమర్పించుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ మొదట్లోనే ఆత్మవిశ్వాసంతో క్రీజులో నిలబడుతున్నట్లు కన్పించిన కేఎల్ రాహుల్ సైతం ఆఫ్ స్టంప్ అవలపడిన బంతిని స్వింగ్ చేయబోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఇప్పటికే ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న రహానే సైతం సీనియర్ల బాటలోనే నడిచాడు. పంత్ కు ఎన్ని అవకాశాలొచ్చిన సద్వినియోగం చేసుకోకుండా చెత్త షాట్ తో మరోసారి వికెట్ పారేసుకున్నాడు.

వీళ్లందరి బ్యాటింగ్ చూసిన భారత అభిమానులు రగిలిపోతున్నారు. సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ మ్యాచులో బంతి పిచ్ మీద బౌన్స్ అవడం.. బ్యాడ్ ఎడ్జ్ కు తాకి భారత ప్లేయర్లు వికెట్లు సమర్పించుకోవడం కామన్ గా కనిపిస్తోంది. పదేపదే బ్యాట్స్ మెన్ ఇదే రీతిలో ఔట్ అవడంతో అభిమానుల్లో ఒకింత అసహనం పెరిగుతోంది.. ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లుగా గుర్తింపు తెచ్చుకున్న భారత ప్లేయర్లు సైకిల్ స్టాండ్ లా కుప్పకూలడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్లు సైతం భారత ప్లేయర్ల ఆటతీరుపై పెదవి విరుస్తున్నారంటే మనోళ్లు ఏ రేంజులో టెస్టు మ్యాచ్ ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

Related Articles

Latest Articles

-Advertisement-