విరాట్ కోహ్లీ మళ్లీ మిస్… 223 పరుగులకు భారత్ ఆలౌట్

కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 223 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (79) ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీ చేసేలా కనిపించిన కోహ్లీ.. మరోసారి అవుట్‌సైడ్ ఎడ్జ్‌తో రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో పుజారా (43), రిషబ్ పంత్ (27) తప్ప ఎవరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 4 వికెట్లు, మాక్రో జాన్సన్ 3 వికెట్లతో సత్తా చాటారు.

Read Also: అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్టార్ క్రికెటర్

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (12), మయాంక్ అగర్వాల్ (15) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. పుజారా, కోహ్లీ జోడీ కాసేపు దక్షిణాఫ్రికా బౌలర్లను కాచుకున్నా… పుజారాను బౌలర్ జాన్సన్ తెలివిగా ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహానె తడబడుతూనే ఆడాడు. 12 బంతుల్లో 9 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లోనే రహానె అవుటయ్యాడు. దీంతో రహానెపై విమర్శలు చెలరేగాయి. ఈ మ్యాచ్‌లో రహానె బదులు హైదరాబాదీ క్రికెటర్ విహారి తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సోషల్ మీడియాలో టీమిండియా అభిమానులు కామెంట్లు చేయడం గమనార్హం.

Related Articles

Latest Articles