ఉపాద్యాయుల క‌ష్టాలుః ఒంటెల‌పై వెళ్లి…

క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతి ఇంకా త‌గ్గిపోలేదు.  చాలా  రాష్ట్రాల్లో క‌రోనా కేసులు తిరిగి పెరుగుతున్నాయి.  కరోనా కార‌ణంగా విద్యార్ధులకు ఆన్‌లైన్ క్లాసులు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.  అయితే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్ధుల‌కు మొబైల్ ఫోన్‌, ఇంట‌ర్నెట్ సౌక‌ర్యాలు లేక‌పోవ‌డంతో రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  విద్యార్ధుల ఇళ్ల‌కు వెళ్లి విద్యాబోధ‌న చేయాల‌ని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ఆదేశించింది.  

Read: “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్ షురూ !

రాజ‌స్థాన్ రాష్ట్రంలో సుమారు 75 ల‌క్ష‌ల మంది విద్యార్దులు ఉన్నారు.  1 నుంచి 8 వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్ధుల ఇళ్ల‌కు వారంలో ఒక‌సారి వెళ్లి విద్యాబోధ‌న చేయాల‌ని, 9 నుంచి 12 త‌ర‌గ‌తుల విద్యార్ధుల ఇళ్ల‌కు వారానికి రెండుసార్లు వెళ్లి విద్యాబోధ‌న చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.  దీంతో వాహ‌నస‌దుపాయాలు లేని గ్రామాల‌కు ఒంటెల‌పై వెళ్లి ఉపాద్యాయులు బోధ‌న చేస్తున్నారు. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-