ఆత్మహత్యలొద్దు.. మీ వెంట మేమున్నాం : బండి సంజయ్‌

317 జీవోను సవరించేదాకా తెగించి కొట్లాడతాం.. కేసీఆర్.. మీరు చేయకపోతే అధికారంలోకి వచ్చాక తొలిరోజే జీవోను సవరిస్తాం.. టీచర్లూ….ఆత్మహత్యలొద్దు మీ వెంట మేమున్నాం.. అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. సంజయ్‌ను కలిసి 317 జీవోవల్ల ఎదురవుతున్న ఇబ్బందులు టీచర్లు వివరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న 317 జీవోను సవరించేదాకా తెగించి కొట్లాడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారికి అండగా బీజేపీ ఉందని భరోసా ఇచ్చారు. ‘‘మీ ఆందోళనకు దిగొచ్చి 317 జీవోను ముఖ్యమంత్రి కేసీఆర్ సవరిస్తే సరేసరి… లేనిపక్షంలో 2023లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చాక తొలిరోజే 317 జీవోను సవరించే ఉత్తర్వులపై ఎవరు సీఎం అయినా సరే…వారితో సంతకం పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా’’అని హామీ ఇచ్చారు.

Related Articles

Latest Articles