టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూత

తెలుగు దేశం పార్టీలో విషాదం నెలకొంది. విజయవాడ టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూశారు. మధ్యాహ్నం గుండె నొప్పితో ప్రయివేట్ ఆసుపత్రి లో చేరిన బాబుకి వైద్యం అందించారు. కానీ సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచారు కాట్రగడ్డ బాబు.

గత 25 ఏళ్లుగా బెజవాడ నగరంలో పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగారు బాబు. దశాబ్ద కాలంగా పేదలకు ఉచిత మందుల పంపిణీ, క్లిన్ అండ్ గ్రీన్ వంటి సేవ కార్యక్రమాలు నిర్వహించారు బాబు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు ఆయన నిత్యం అందుబాటులో వుండేవారు. కాట్రగడ్డ బాబు మృతిపట్ల టీడీపీ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు.

Related Articles

Latest Articles