సజ్జల మరోసారి ప్రెస్ మీట్ పెడితే హైకోర్టుకు వెళ్తాను: వర్ల రామయ్య

వైసీపీలో అంతా తానై సజ్జలే నడిపిస్తున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ .. సజ్జలపై సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల మరో సారి ప్రెస్‌మీట్‌ పెడితే హైకోర్టుకు వెళ్తామన్నారు. ప్రభుత్వంలో పిల్లి ఈనినా.. కుక్క అరిచినా సజ్జలే సమాధానం చెబుతున్నా రన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న రోజుల్లో జగన్ బెంగళూరులో ఉన్నప్పుడు ఆయ నతోనే కలిసి సజ్జలే ఉండేవారని ఆయన అన్నారు. ఒకే కంచం.. ఒకే మంచం అన్నట్టుగా సజ్జల-జగన్ ఉండేవారని వర్ల రామయ్య ఆరోపిం చారు. దొంగ లెక్కలు చెప్పడంలో సజ్జల దిట్ట అని ఆయన అన్నారు.


సీఎంగా జగన్‌ ఉన్నా.. ప్రభుత్వాన్ని సజ్జలే నడుపుతారని జగన్ కావాలని సలహాదారు పదవి సజ్జలకు కట్టబెట్టారన్నారు. ఓ సలహా దారుగా ఉన్న సజ్జల అన్ని విషయాలు ఆయనే ఎలా మాట్లాడతారు..? అలంకారానికి దళితురాలైన హోం మంత్రా..? అనుభవించేది సజ్జ లా..? అంటూ ఆయన విమర్శించారు. సీఎం జగన్‌ ఏ విషయంపైనా ఎందుకు మాట్లడరు..? హోం మంత్రి ఎందుకు మాట్లడదు..? వారు ప్రభుత్వంలో లేరా.. అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు.మరోసారి సజ్జల ప్రెస్ మీట్ పెడితే సజ్జలే సీఎం అని రాష్ట్రం మొత్తం తిరిగి చెబుతానని వర్ల రామయ్య అన్నారు.

Related Articles

Latest Articles