మేం రాజీనామాలు చేస్తాం.. వైసీపీ 22 మంది ఎంపీలు సిద్ధమా..?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు సవాల్‌ విసిరారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. వైసీపీ ఎంపీలు గుంపులో గోవిందలాగా పార్లమెంట్ లో వ్యవహరిస్తున్నారని విమర్శించిన ఆయన.. ప్రజలను మభ్య పెట్టడానికి పార్లమెంట్ లో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించిన ఆయన.. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు.. ఎవరు ఎప్పుడే ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.. నాలుగు ఫోటోలు తీసుకోవడానికే హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తోందని దుయ్యబట్టిన రామ్మోహన్‌నాయుడు.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు చేయడానికైనా మేం సిద్ధం.. దీనిపై వైసీపీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా వస్తుందన్నారు.. మరి మేం రాజీనామాలు చేస్తాం… వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు సిద్ధమా? అని ప్రశ్నించారు.

వైసీపీ ఎంపీలు ఈ రెండేళ్లు ఏంచేశారు… ఇప్పుడే ఎందుకు నిద్ర లేచారు? అని ప్రశ్నించారు రామ్మోహన్‌ నాయుడు.. ఎంపీ రఘురామకృష్ణరాజు పై అనర్హత వేటు వేయించడానికి డ్రామా ఆడుతున్నారన్న ఆయన.. ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న పోరాటమేంటో… మమ్మల్ని ఏం సాయం అడిగారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల విమర్శలకు మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న ఆయన.. మేం పార్లమెంట్‌లో చేస్తున్న పోరాటమేంటో ప్రజలే గమనిస్తున్నారని.. నిరూపించుకోవాల్సిన బాధ్యత వైసీపీ పార్టీ పైనే ఉందన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-