టీడీపీ ఎంపీ కేశినేని నాని అలక వీడినట్లేనా..?

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున కేశినేని నాని ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయన టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో కేశినేని నాని పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు శుక్రవారం నాడు ఎంపీ కేశినేని నాని సంఘీభావం ప్రకటించారు. తాజా పరిణామంతో తెలుతు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని అలక వీడినట్లే అని అభిప్రాయపడుతున్నారు.

Read Also: టీడీపీని బీజేపీలో కలిపేస్తారు.. డొక్కా సంచలన వ్యాఖ్యలు

కాగా కొద్దిరోజుల క్రితం ఎంపీ కేశినేని నాని చంద్రబాబుపై వ్యతిరేకత చూపించారు. కేశినేని భవన్‌లో చంద్రబాబు ఫోటోను తొలగించి ఆ స్థానంలో ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా ఫోటోను ఉంచారు. దీంతో కేశినేని నానికి, టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్య విభేదాలు వచ్చాయని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ కథనాలను ఎంపీ కేశినేని నాని ఖండించకపోవడంతో ఆయన పార్టీ మారేది ఖాయమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు భావించారు. తీరా కట్ చేస్తే శుక్రవారం నాడు ఆయన టీడీపీ కార్యాలయానికి వెళ్లి తమ అధినేత చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటించారు. కాగా ఇటీవల విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కేశినేని నాని తన కుమార్తెను ఎన్నికల్లో నిలబెట్టగా.. ఆమె టీడీపీ తరఫున కార్పొరేటర్‌గా విజయం సాధించిన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles