ఢిల్లీకి వెలిగొండ ప్రాజెక్టు లొల్లి.. కేంద్ర జలశక్తి మంత్రితో టీడీపీ నేతల భేటీ

వెలిగొండ ప్రాజెక్టు విషయంలో.. ఇటు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలు.. మరోవైపు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.. ఇప్పుడు హస్తినకు కూడా వెళ్లారు.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలిసింది ప్రకాశం, నెల్లూరు జిల్లాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యలు, మాజీ శాసనసభ్యలు, నాయకుల బృందం.. వెలిగొండ ప్రాజెక్టు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని కేంద్ర మంత్రిని కోరిన టీడీపీ టీమ్.. ప్రకాశం జిల్లా కరువు పరిస్థతిని, జిల్లా నైసర్గిక స్వరూపాన్ని, వెలిగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను సవివరంగా కేంద్రమంత్రికి వివరించింది.. ఢిల్లీ వెళ్లిన టీడీపీ టీమ్‌లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, ఉదయగిరి (నెల్లూరు) మాజీ శాసనసభ్యలు బొల్లినేని రామారావు, కనిగిరి మాజీ శాసనసభ్యలు డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు మాజీ శాసనసభ్యలు దామచర్ల జనార్ధన్, సంతనూతలపాడు మాజీ శాసనసభ్యలు బి.ఎన్. విజయ్ కుమార్, యర్రగొండపాలెం తెదేపా ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు, ఒంగోలు తెదేపా నాయకుడు దామచర్ల సత్య తదితరులు ఉన్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-