స్పీకర్ పై నేను అనుచిత వ్యాఖ్యలు చేయలేదు : అచ్చెన్నాయుడు

ఈరోజు అసెంబ్లీలో ప్రివిలేజ్ క‌మిటీ ముందు వ్య‌క్తిగ‌తంగా హ‌జ‌రు అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. ఆ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ… స్పీకరుపై అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ నన్ను విచారణకు పిలిచారు. వ్యక్తిగత కారణాల వల్ల గతంలో రాలేకపోయాను. నేను స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ప్రెస్ నోట్ పేర్కొన్న అంశాలపై ప్రివిలేజ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దానికి సంబంధించిన అంశంపై వివరణ ఇచ్చాను అని తెలిపారు. ఎలాంటి బేషజాలు లేకుండా విచారం వ్యక్తం చేశాను. ముందు వైసీపీ ఎమ్మెల్యేను.. ఆ తర్వాతే స్పీకర్ నని గతంలో తమ్మినేని సీతారాం అన్నారు అని తెలిపారు. అగ్రీగోల్డ్ అంశం కోర్టులో ఉన్నా.. చంద్రబాబును తమ్మినేని విమర్శించారు. నాకు చట్టం పైనా.. వ్యవస్థల పైనా నమ్మకం ఉంది. స్పీకర్ స్థానంపై గౌరవం ఉంది. కమిటీ నా వివరణతో సంతృప్తి చెందిందని భావిస్తున్నా అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-