టీడీపీలో రాయలసీమ స‌ద‌స్సు చిచ్చు…

తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేర‌కు రాయ‌ల‌సీమ‌లోని సాగునీటి ప్రాజెక్టుల‌పై స‌ద‌స్సును నిర్వ‌హించారు.  ఈ సద‌స్సుపై జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి చేసిని వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.  జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు కౌంట‌ర్ ఇచ్చారు.  పార్టీ ఆదేశాల మేర‌కు రాయ‌ల‌సీమ సాగునీటి ప్రాజెక్ట్‌లపై స‌ద‌స్సు  జ‌రిగింద‌ని, దీనిని ఎలా త‌ప్పు ప‌డ‌తార‌ని ఎమ్మెల్యే కేశ‌వ్ పేర్కొన్నారు.  కాల్వ శ్రీనివాసుల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌ని ఎమ్మెల్యే కేశ‌వ్ కౌంట‌ర్ ఇచ్చారు.  తాడిప‌త్రి రాజ‌కీయాలు ఇక్క‌డ చేస్తే తిరుగుబాటు త‌ప్ప‌ద‌ని మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి మండిప‌డ్డారు.  అవ‌స‌ర‌మైతే  జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డికి వ్య‌తిరేకంగా పోరాటం చేసేందుకు రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని, ఆత్మ‌గౌరవాన్ని దెబ్బ‌తీస్తే తీవ్ర‌మైన ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని ప్ర‌భాక‌ర్ చౌద‌రి పేర్కొన్నారు.  ఇక వైసీపీ నేత‌ల‌తో త‌మ‌కు ఎలాంటి లావాదేవీలు లేవ‌ని, ఎమ్మెల్యే పెద్దారెడ్డితో బంధుత్వం ఉన్న‌ది కాబ‌ట్టి క‌లిసి భోజ‌నం చేశాన‌ని మాజీ మంత్రి ప‌ల్లె రఘునాథ‌రెడ్డి పేర్కొన్నారు.

Read: ఆఫ్ఘ‌న్‌లో మ‌హిళ‌లు చ‌దువుకోవ‌చ్చు… అయితే అలా మాత్రం కాదు…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-