టీడీపీ నేత అరగుండు, అరమీసం.. మాటంటే మాటే..?

నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీ, నగరపంచాయతీలకు ఎన్నికలు జరుగగా నిన్న ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే నెల్లూరులోని 49,50 డివిజన్లకు టీడీపీ తరుపున ఇంచార్జీగా వ్యవహరించిన కప్పిర శ్రీనివాస్‌ అరమీసం, అరగుండుతో దర్శనమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో 49,50 డివిజన్లలో టీడీపీ గెలవపోతే అరగుండు, అరమీసం తీయించుకుంటానని సవాల్ చేశారు శ్రీనివాస్..

ఈ మాటకు కట్టుబడి ఎన్నికల ఫలితాల అనంతరం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరు కార్పోరేషన్‌లో 54 డివిజన్‌లకు 54 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల తమ సత్తా చాటారు. ఒక్క చోట కూడా టీడీపీ అభ్యర్థి గెలువలేదు. కప్పిర శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. 49,59 డివిజన్లలో గెలిచేందుకు వైసీపీ రూ.3 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చేంతవరకు ఇలాగే ఉంటానని వెల్లడించారు.

Related Articles

Latest Articles