విద్యుత్ వాడకం తగ్గించుకోవాలని సూచించడం సిగ్గుచేటు…

వైసీపీ పెద్దల చేతి వాటం కారణంగా రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయి అని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. యూనిట్ రూ.20కి ప్రైవేటు సంస్థల నుండి కొనుగోలులో మర్మమేంటి అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 22.5 మిలియన్ యూనిట్ల లోటును అధిగమించి మిగులు విద్యుత్ సాధించాం అని గుర్తు చేసారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు జగన్ ప్రభుత్వం రూ.12 వేల కోట్ల బకాయిలు ఉంచింది అన్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన భారం వేశారు. అధికారంలోకి వచ్చీ రాగానే సోలార్, విండ్ పవర్ ఒప్పందాల రద్దుతో నేడు విద్యుత్ సంక్షోభం వచ్చింది అని అన్నారు. ఇక రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూసేసి.. బినామీ థర్మల్ ప్లాంట్ల నుంచి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండున్నరేళ్లలో వినియోగదారులపై రూ.36,802 కోట్ల భారం ఓడింది అన్నారు. దాంతో లైట్ వేయాలన్నా, ఫ్యాన్ వేయాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది అన్న ఆయన ప్రజలు విద్యుత్ వాడకం తగ్గించుకోవాలని సూచించడం సిగ్గుచేటు…. ఉద్దరిస్తానని అధికారంలోకి వచ్చి.. రాష్ట్రాన్ని ఊడ్చేస్తున్నారు అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles