ఏపీ, తెలంగాణలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి : చంద్రబాబు

ఏపీలో ఏక పక్షంగా జరిగిన ఎన్నికలు స్థానిక ఎన్నికలు జరిగాయి. మేము ఆ ఎన్నికలని బాయ్కాట్ చేసాము అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. వైసిపి పార్టీ వాళ్లకి నేరాలు-ఘోరాలు చేయడం అలవాటు. ఇప్పుడు కూడా వైసిపి వాళ్ళు ఏమి చేయలేరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడం రికార్డ్ అన్నారు.

ఇక ఏపీలో, తెలంగాణలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎప్పుడు ఎబిసిడి వర్గీకరణ కోసం పని చేసుకుంటూ వచ్చాను. ఏపీలో ఒకసారి ఓటేసారు రెండోసారి ఓటు వేయకూడదు అనుకుంటున్నారు. జగన్ కు నేరాలు-ఘోరాలు చేయడం అలవాటు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు నేరాలు చేయలేదు. నేను రౌడీయిజం చేయాలనుకుంటే జగన్ బయటకు వచ్చేవాడు కాదు. ఏపీలో టీడీపీ ఎవరు ఏం చేయలేరు. జగన్ పెట్టివన్నీ తాత్కాలిక ఇబ్బందులే. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలి. తెలంగాణలో ప్రజాస్వామ్యం దారుణంగా ఉంది. నాలాంటి వాడు మీటింగ్ పెట్టుకునే పరిస్థితి కూడా తెలంగాణలో లేదు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నా మీదనే తప్పుడు కేసులు బనాయించారు అని పేర్కొన్నారు.

-Advertisement-ఏపీ, తెలంగాణలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి : చంద్రబాబు

Related Articles

Latest Articles