బాధితుల మీదే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు..!

ఆంధ్రప్రదేశ్‌లో బూతుల పర్వం కాస్త.. కేసుల నమోదుకు దారితీసింది.. అయితే, బాధితుల మీదే కేసులు నమోదు చేస్తున్నారు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. తనపై గుంటూరులో కేసు నమోదు చేయడంపై స్పందించిన ఆయన.. బాధితుల మీదే కేసులు పెడుతున్నారు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.. చంపుతామన్న మైదుకూరు ఎమ్మెల్యే మీద ఏం కేసులు పెట్టారు..? అంటూ ఈ సందర్భంగా నిలదీసిన ఆయన.. చంద్రబాబు మీద బాంబులేస్తామన్న కుప్పం వైసీపీ నేత సెంథిల్ కుమార్ పై ఏం చర్యలు తీసుకున్నారు? అని నిలదీశారు.. చంద్రబాబును.. టీడీపీ నేతలను దుర్భాషలాడిన కావటి మనోహర్ నాయుడుపై ఏం కేసులు పెట్టారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన బోండా ఉమ.. అయితే, కేసులకు భయపడం.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

కాగా, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేశారు అరండల్ పేట పోలీసులు.. మూడు రోజుల క్రితం బోండా ఉమపై ఫిర్యాదు చేశారు గుంటూరు మేయర్ కావటి మనోహర్… టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష సమయంలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు.. దీంతో.. బోండా ఉమాపై ఐపీసీ 153ఏ, 294 బీ, 504 , 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అరండల్‌ పేట్‌ పోలీసులు.

Related Articles

Latest Articles