బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ ప్రభుత్వానికి లేదు: అచ్చెన్నాయుడు

బీసీల విషయంలో జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో బీసీలకు అడుగడుగునా వంచన జరిగిందని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ల కోతతో 16,800 మందికి పదవులు దూరమయ్యాయని గుర్తుచేశారు. బీసీ జనగణన కోరుతూ 2014లోనే తెలుగుదేశం తీర్మానం చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఢిల్లీ చుట్టూ కేసుల కోసం తిరగడం తప్ప.. బీసీ గణనపై కేంద్రంపై ఎప్పుడైనా జగన్ ప్రభుత్వం ఒత్తిడి చేసిందా అని నిలదీశారు.

Read Also: జీతాలకే డబ్లుల్లేవు… మళ్లీ మూడు రాజధానులా?: సోము వీర్రాజు

బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు.. వైసీపీ నేతలకు లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బీసీలను అణగదొక్కడమే లక్ష్యంగా రెండున్నరేళ్ల జగన్ పాలన సాగిందన్నారు. మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లుగా ఉన్న బీసీలకు షాడోలను నియమించడం ద్రోహం కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తిరుపతి మేయర్‌గా బీసీని నియమించి.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరో నేతను షాడోను నియమించడం వాస్తవం కాదా అని నిలదీశారు. మరోవైపు మంత్రులనూ స్వతంత్రంగా పని చేయనివ్వడం లేదన్నారు. వెయ్యికిపైగా ఉన్న నామినేటెడ్ పదవుల్లో బీసీలు 10శాతం కూడా లేరని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 16 యూనివర్శిటీల్లో 9 వర్శిటీలకు వీసీలుగా టీడీపీ బీసీలను నియమించిందన్నారు. ప్రతిష్టాత్మక సంస్థలు, కేబినెట్‌ హోదా కలిగిన పదవుల్లో బీసీల స్థానమెంతో చెప్పాలని జగన్‌ను డిమాండ్ చేశారు.

Related Articles

Latest Articles