వైసీపీ పతనానికి ముహూర్తం ఫిక్స్ అయింది: అశోక్ బాబు

ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల శాతం బాగా పెరిగిందని, వైసీపీ పతనానికి ముహుర్తం కూడా ఫిక్స్‌ అయిందని టీడీపీ నేత అశోక్‌ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార వైసీపీ పై విరుచుకు పడ్డాడు. వైసీపీకి సమాధి కట్టడానికి టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. టీడీ పీకి ప్రజాదరణ పెరిగిందని ఆయన అన్నారు. ఈ విజయం సీఎం జగ న్‌ది కాదు.. డీజీపీదని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు వెళ్లి సీఎంని కల వడం కాదు.. డీజీపీని సత్కరించి.. సన్మాచాలని అశోక్‌ బాబు అన్నా రు. పోలీసుల సహకారం ఉండటంతోనే వైసీపీ గెలిచిందన్నారు.

కేవలం కుప్పంలో ఓడిపోతే టీడీపీ ఓడిపోయినట్లు కాదని అశోక్‌ బాబు అన్నారు. ఇది బలుపు కాదు వాపు అని వైసీపీ అర్థం చేసుకోవాలి. 2024 లో వైసీపీ ఆటలు సాగవు. దర్శిలో ఓడినందుకు వైసీపీ ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి రాజీనామా చేయాలని ఆయన అశోక్‌ బాబు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఒక రోజు పెట్టి ఏడాది జీతం తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యేలకు కొంచైమైనా సిగ్గు ఎగ్గు ఉండాలని ఘాటు వ్యాఖ్య లు చేశారు. వైసీపీ పై తిరుగుబాటు ప్రారంభం అయిందని వారి డ్రామాలు ఇక సాగవని అశోక్‌ బాబు అన్నారు.

Related Articles

Latest Articles