భారత్‌ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు..

ఈనెల 27 న భారత్‌ బంద్‌ నిర్వహించాలని జాతీయ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌.. రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ బంద్‌ కొనసాగనుంది.. ఇందుకు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ప్రటిస్తున్నాయి. మోడీ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ దేశ వ్యాప్తంగా ఈ నెల 27న తలపెట్టిన భారత్‌ బంద్‌ చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది.. అయితే.. 27న రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ.. రైతుల ప్రయోజనాలే టీడీపీకి ప్రధానం అని.. రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలపై కేంద్రం పునరాలోచించాలని డిమాండ్ చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రైతు వ్యతిరేక చట్టాల విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తుచేసిన ఆయన.. రైతులను జగన్ కూలీలుగా మార్చారంటూ ఫైర్ అయ్యారు.

Related Articles

Latest Articles