ఇప్పటి అవినీతికి కోర్టులు కూడా చాలవు.. చంద్రబాబు ఫైర్

ఇప్పుడు చేస్తున్న అవినీతికి కోర్టులు కూడా చాలవు అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. గుంటూరు జిల్లా చింతలపూడి వెళ్లిన ఆయన.. సంగం డెయిరీ కేసులో అరెస్టై.. జైలుకి వెళ్లొచ్చిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించారు.. పార్టీ పూర్తి అండగా ఉంటుందని చెప్పారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత.. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నరేంద్రది.. ఆయన తండ్రి నుండి ఇక్కడి ప్రజలకు, సంగండైరీ రైతాంగానికి అండగా ఉంటున్నారని.. వరుసగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ సేవలు అందించారని.. కానీ, ఇలాంటి పరిస్థితి నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు.. విలువలు లేని, కక్షా రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు అని హెచ్చరించిన ఆయన.. రాజకీయ కక్షతో ఏ తప్పు చేయకుండా ముందస్తు నోటీసులు లేకుండా నరేంద్రాని అరెస్ట్ చేశారని ఆరోపించారు… చట్టాన్ని ఉల్లంఘించి పని చేసే వారు భౌవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు చంద్రబాబు.

అందరూ వైసీపీ నేతల్లాగా తప్పుడు మనుషులు లేరు అని వ్యాఖ్యానించారు చంద్రబాబు.. ప్రభుత్వంలో 43 వేల కోట్ల రూపాయల అవినీతి చేశారన్న ఆయన.. ఇప్పుడు చేస్తున్న అవినీతికి కోర్టులు కూడా చాలవు అన్నారు.. నరేంద్ర ఆస్తులు, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు గడిచిన పదేళ్లలో ఎంత పెరిగాయో ప్రజలు చూడాలన్నారు.. ధర్మం కోసం ప్రజా వ్యతిరేక విధానాలపై నరేంద్ర పోరాటం చేస్తున్నారని.. నరేంద్రను బెదిరిస్తూ వచ్చారు.. చివరికి అరెస్ట్‌ చేశారు అని విమర్శించారు.. ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన చంద్రబాబు.. సోషల్ మీడియా కేసులో అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్ట చెప్పినా వీళ్లు అరెస్ట్ చేస్తున్నారని.. ఉన్మాది పాలలో పోలీసులు కూడా అలాగే తయారయ్యారని మండిపడ్డారు.. రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి… ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారో.. అలాంటి వారిని వదిలిపెట్టబోమన్న ఆయన.. రాయలసీమలో గతంలో ఉన్నా హత్యా రాజకీయాలు, ముట్టా కక్షలకు తాము చరమగీతం పాడాం… కానీ, మళ్లీ ఈ ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. గతంలో మేం ఇదే విధంగా చేస్తే మీరు ఈ రోజు అధికారంలో ఉండేవారా…? అని ప్రశ్నించారు చంద్రబాబు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-