విశాఖపై జగన్ వర్సెస్ అశోక్.. మాటల యుద్ధం

రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖ అన్నారు జగన్. ఈ సిటీలో రోడ్లు వున్నాయి. కరెంట్, అన్ని రకాల వసతులు వున్నాయి. సుందరీకరణపై శ్రద్ధ పెడితే విశాఖ హైదరాబాద్‌ తో పోటీపడుతుందన్నారు. మూడురాజధానుల విషయలో జగన్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. పాత చట్టం తీసేసి కొత్త చట్టంతో వస్తామన్నదానికి అర్థం పర్థం లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. సీఎం జగన్ నిర్ణయాలతో జనానికి తీరని లోటని తప్పుబట్టారు.

వికేంద్రీకరణ పేరుతో మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతగా అమరావతిని స్వాగతించి.. అధికారం రాగానే 3 రాజధానుల మంత్రం జపిస్తున్నారని అశోక్ గజపతిరాజు విమర్శించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిని జపించే జగన్ చేసిన అభివృద్ధేంటో చెప్పాలి? అని ప్రశ్నించారు. విశాఖలో భవనాలకు రంగులేస్తే రాజధాని అవుతుందా అని నిలదీశారు. వైసీపీ నిర్ణయాల్లో కొన్ని విషయాలు చూస్తే భయంగా వుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles