టీడీపీ ఇప్పటికే కాడి పడేసింది: సజ్జల

వైసీసీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపై విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన లోపాయికారి ఒప్పందాలకు వెళ్లాయన్నారు. కుప్పం కోట తొలిసారి బద్ధలైంది అన్నారు. మా ప్రభుత్వ పనితీరును వివరిస్తూ ఓట్లు అడిగాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌ స్వీప్ చేసింది. కుప్పంలో 8 వేల దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు.

ఐఎస్‌ అధికారులు, ఐపీఎస్‌ అధికారులంటే చంద్రబాబు చిన్న చూపు చూస్తారన్నారు. మా ప్రభుత్వంలో వారికి స్వేచ్ఛను ఇచ్చామ న్నారు. కొత్త తరం రాజకీయాలను చంద్రబాబు చూడాలని, ఆయన ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పు కోవాల్సిన సమయం వచ్చిందని సజ్జల అన్నారు. దొంగ ఓట్లు వేయడం ఎలా సాధ్యమవుతుంది. ఓటమికి సాకులు వెతకడంలో చంద్రబాబు దిట్ట అని సజ్జల ఆరోపిం చారు. ప్రభుత్వం పై ప్రజల అభిప్రాయం ఇప్పటికే తెలిసిపోయింది. నన్ను గుర్తించకుంటే అది మీ ఓటమి అని అనడం చంద్రబాబు అహం కారానికి నిదర్శనమి ఆయన అన్నారు. ఇదే అహంకారంతో లోకేష్‌ కూడా వ్యవహరి స్తున్నాడన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజా అభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలని సజ్జల అన్నారు.

సీఎం జగన్‌ మంచి పనులు చేస్తున్నారు కనుకనే ప్రజలు ఆదరిస్తు న్నారన్నారు. మా ప్రభుత్వం పై ప్రజలకు విశ్వాసం ఉందని, సకాలం లో వర్షాలు పడుతున్నాయని, పంటలు పండుతున్నాయని యువత కు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చామని వారు సంతోషంగా ఉన్నారని సజ్జల అన్నారు. ఇవేమి తెలియకుండా చంద్రబాబు కేవలం అధికారం లేద నే ఎప్పుడు ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ రాష్ర్టంలో ఏదో ఒక అల జడి సృష్టించాలని చూస్తున్నారని సజ్జల అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలను తెలుసుకుని ప్రజల్లో ఉండి రాజకీయం చేయాలన్నారు. ఆయనదంతా వెన్నుపోటు రాజకీయమేనని చంద్రబాబును ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Related Articles

Latest Articles