ఆ ఎన్నిక‌ల నుంచి టీడీపీ కూడా త‌ప్పుకున్న‌ట్టేనా…!!

బద్వేల్ నియోజ‌క వ‌ర్గానికి ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలు బ‌రిలో ఉంటాయ‌ని అనుకున్నారు.  వైసీపీ ఇప్ప‌టికే అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించింది.  జ‌న‌సేన, టీడీపీలు కూడా పోటీలో ఉంటాయ‌ని అనుకున్నారు.  కానీ, సంప్ర‌దాయాల‌ను గౌర‌విస్తూ పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు మొద‌ట జ‌న‌సేన పార్టీ ప్ర‌క‌టించింది.  ఇదే బాట‌లో టీడీపీ కూడా నిర్ణ‌యం తీసుకుంది.  టీడీపీ నుంచి మొద‌ట డాక్ట‌ర్ ఓబుళాపురం రాజ‌శేఖ‌ర్ పోటీ చేస్తార‌ని అనుకున్నారు.  కాని, జ‌న‌సేన నిర్ణ‌యం త‌రువాత‌, టీడీపీ కూడా త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్న‌ది.  పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. జ‌న‌సేన‌, టీడీపీలు త‌ప్పుకోవ‌డంతో ఎన్నిక ఏక‌గ్రీవం అయ్యే అవ‌కాశం ఉన్న‌ది.  అయితే, బీజేపీ అభ్య‌ర్ధిని బ‌రిలోకి దించాల‌ని చూస్తున్న‌ది. ఈరోజు రేప‌ట్లో అభ్య‌ర్థిని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ది.  ఒక‌వేళ బీజేపీ అభ్య‌ర్థి నామినేష‌న్ దాఖ‌లు చేస్తే ఉప ఎన్నిక జ‌రగే అవ‌కాశం ఉంటుంది.  లేదంటే ఏక‌గ్రీవం కావొచ్చు.  

Read: వంతెన కింద ఇరుక్కుపోయిన విమానం… వైర‌ల్‌…

-Advertisement-ఆ ఎన్నిక‌ల నుంచి టీడీపీ కూడా త‌ప్పుకున్న‌ట్టేనా...!!

Related Articles

Latest Articles