ప్లేన్ క్రాష్ లో ‘టార్జాన్’ హీరో మృతి

హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ ‘టార్జాన్: ది ఎపిక్ అడ్వెంచర్స్’ హీరో జో లారా టేనస్సీలో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూసినట్లు సమాచారం. ఆయన వయసు 58 సంవత్సరాలు. లారా దంపతులకు ముగ్గురు పిల్లలు. ఈ ప్రమాదంలో అతనితో పాటు జో లారా భార్య, అమెరికన్ రచయిత మరియు డైటీషియన్ గ్వెన్ షాంబ్లిన్ సహా మరో ఐదుగురు ప్రయాణికులు అమెరికా నగరమైన నాష్విల్లె సమీపంలో ఒక సరస్సులో ప్రైవేట్ జెట్ కూలిపోవడంతో మరణించారు. వారు ప్రయాణిస్తున్న సెస్నా 501 అనే బిజినెస్ జెట్ అక్కడి సమయం ప్రకారం శనివారం ఉదయం 11 గంటలకు టెనెస్సీ ఎయిర్ పోర్టు నుంచి ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కు బయల్దేరింది. కానీ నాట్విల్లెకు దక్షిణాన 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెర్సీ ప్రీస్ట్ సరస్సులో జెట్ కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్ చేసి 5 మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ధృవీకరించారు. అయితే ప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది. ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ వార్తను ధృవీకరించిన తరువాత జో లారా అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. లారా నటించిన టెలివిజన్ సిరీస్ ‘టార్జాన్: ది ఎపిక్ అడ్వెంచర్స్’ మొత్తం 22 ఎపిసోడ్‌లుగా 1996-2000 మధ్య వచ్చింది. ‘స్టీల్ ఫ్రాంటియర్’, ‘సన్‌సెట్ హీట్’, ‘ఆపరేషన్ డెల్టా ఫోర్స్’, ‘గన్స్మోక్: ది లాస్ట్ అపాచీ’, ‘అమెరికన్ సైబోర్గ్: స్టీల్ వారియర్ ‘,’ ది మాగ్నిఫిసెంట్ సెవెన్ ‘,’ బేవాచ్ ‘,’ ట్రాపికల్ హీట్ ‘ తదితర చిత్రాల్లో లారా నటించాడు. లారా మరియు గ్వెన్ ముగ్గురు పిల్లలను విడిచిపెట్టారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-