బంగారు తెలంగాణాలోరక్షకులు.. భక్షకులుగా మారారు: తరుణ్‌ చుగ్‌

బంగారు తెలంగాణలో రక్షకులు భక్షకులుగా మారారని బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైలులో ఉన్న మా నేత ఉన్న మా కార్యకర్తలు,నాయకులు ధైర్యంగా ఉన్నారన్నారు. ప్రజల ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న బండిసంజయ్ పై ఇతర నేతలపై దాడి చేచసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు ఖాకీలు గులాబీ కండువా కప్పుకుని కేసీఆర్‌ చేతిలో బార్బీ బొమ్మలుగా మారారని విమర్శించారు. దీక్షలో పాల్గొన్న మహిళలను కించపర్చారు. బట్టలు జారుతున్న పోలీసులు వదలలేదు. కరీంనగర్‌లో గుండా పోలీసుల తీరు సరైనది కాదన్నారు.

Read Also: తెలంగాణలో రజాకార్ల పాలన నడుస్తుంది: మధుయాష్కీ

కమిషనర్‌ సత్యనారాయణ వ్యవహారం సరిగ్గా లేదన్నారు. ఆయన దుర్యోధన, దుశ్శాసన పర్వలా చేశారని ఆరోపించారు. కోవిడ్ నిబంధనల పేరుతో బండి సంజయ్‌ని ఉగ్రవాదిలాగా చూశారు. వలసవాద సామ్రాజ్యవాద పాలనలో డయ్యర్‌గా పోలీసులు వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం బుధ్ధితెచ్చుకోవాలని తరుణ్‌చుగ్‌ అన్నారు. ప్రభుత్వ చర్యలకు త్వరలోనే బదులు ఇస్తామన్నారు. ఏది మర్చిపోం.. ఎవరైనా చట్టప్రకారం పనిచేయాలన్నారు. లార్డ్‌ ఇర్విన్‌, డల్హౌసిలాగా పనిచేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు నివేదిక ఇస్తాం. గవర్నర్‌ను కూడా కలుస్తామని తరుణ్‌ చుగ్‌ వెల్లడించారు.
కరీంనగర్‌కు చేరుకున్న మాజీ సీఎం రమణ్‌సింగ్‌
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పార్లమెంటు ఆఫీసు, నివాసానికి వెళ్లిన మాజీ సీఎం రమణ్‌సింగ్‌. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన ఘటనను బండి సంజయ్‌ రమణ్‌ సింగ్‌కు వివరించారు. మరి కాసేపట్లో మాజీ సీఎం రమణ్‌ సింగ్‌ మీడియా సమావేశం.

Related Articles

Latest Articles