భోపాల్ గ్యాస్ దుర్ఘటన నేపథ్యంలో ‘తప్పించుకోలేరు’

1984 డిసెంబర్ 3వ తేదీ అర్థరాత్రి మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఘోర దుర్ఘటనను ఈ దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ నేపథ్యంలో వివిధ భారతీయ భాషల్లో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా తెలుగులోనూ ‘తప్పించుకోలేరు’ పేరుతో ఓ మూవీ రూపుదిద్దుకుంది. ‘కొత్త కథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి.) ఈ సినిమాను తీశారు. దీనిని తలారి వినోద్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్ మామిడాల, లలిత్ కుమార్ తో కలిసి దర్శకుడు రుద్రాపట్ల వేణుగోపాల్ నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న ‘తప్పించుకోలేరు’ను ఆగస్ట్ ప్రథమార్ధంలో విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.

ఆదర్శ్, హరీష్, ట్వింకిల్ అగర్వాల్, సాయి శ్వేత, ఆకెళ్ల, ఫహీం ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ గ్యాస్ సంఘటన స్పూర్తితో తెరకెక్కిందని, దీని చిత్రీకరణ సమయంలో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ ఎంతో సహకరించిందని వారు చెప్పారు. సినిమాలో చాలా భాగం షూటింగ్ ను భోపాల్, దాని పరిసర ప్రాంతాల్లో జరిపామని, అందుకే ఆ రాష్ట్రంలోనూ దీనిని విడుదల చేయాలనుకుంటున్నామని అన్నారు. ఇండియన్ స్క్రీన్ పై ఇంతవరకూ వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కు ఇది భిన్నంగా ఉంటుందని, వి.ఎస్.పి. తెన్నేటి రాసిన మాటలు, పాటలు; రాజేశ్ రాజ్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-