తెలంగాణకి బీజేపీతో ప్రమాదం పొంచి ఉంది : తమ్మినేని వీరభద్రం

బీజేపీ విచ్ఛిన్నకర విధానం అమలు చేస్తోందని, తెలంగాణకి బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఓటమి లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. బీజేపీ పట్ల టీఆర్‌ఎస్‌ మెతక వైఖరి అవలంబిస్తోందని, ఈ మధ్య బీజేపీ ఒడిపోవాలని కేసీఆర్‌ స్టేట్ మెంట్ ఇస్తున్నారు.. సంతోషమేనని ఆయన అన్నారు. కానీ కేసీఆర్‌ ప్రకటనలే వస్తున్నాయి.. కానీ ఆయన స్టేట్ మెంట్ ఎక్కడ లేదని ఆయన పేర్కొన్నారు.

లీకులు ఇచ్చి చెప్పేది నమ్మలేమని, లీకులు ఇచ్చి బీజేపీనీ దారిలోకి తెచ్చుకుంటున్నారా..? జనం అభిప్రాయం తెలుసుకోవాలని లీకులు ఇస్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. స్పష్టమైన విధానం ఉండాలని, టీఆర్‌ఎస్‌ పాలన అప్రజాస్వామ్యంగా ఉందన్నారు. కేసీఆర్‌ దొర వైఖరి కొనసాగిస్తున్నారని, పోరాటం కాదు.. బ్రతిమిలాడితేనే చేస్తాం అనే వైఖరిలో టీఆర్‌ఎస్‌ ఉందన్నారు. ఇది మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ఇదే జరిగిందన్నారు.

Related Articles

Latest Articles