చిరంజీవి సంకల్పం వల్లే… : తమ్మారెడ్డి భరద్వాజ

కరోనా క్రైసిస్ ఛారిటీని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం కొంతకాలంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్సెస్ కావడంతో పాటు రెండో డోస్ వ్యాక్సినేషన్ కూడా తుదిదశకు చేరుకుంది.

ఈ సందర్బంగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ”ప్రపంచం అంతా యేడాదిన్నర నుండి అతలాకుతలం అయిపోతోంది. సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అలాంటి సమయంలో చిరంజీవి స్పందించి కరోనా సమయంలో సినిమా కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి సంకల్పం వల్లే ఈ రోజు కార్మికులకు వాక్సిన్ అందింది. అలాగే కరోనా నుండి ప్రజలను కాపాడడానికి ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ తరువాత సినిమా కార్మికులకు వ్యాక్సినేషన్ కూడా వేయిస్తున్నారు. ఇప్పటివరకు 5000 మందికి పైగా వాక్సిన్ వేసుకున్నారు. ప్రస్తుతం షూటింగ్స్ బిజీగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎక్కడ, ఎవరు ఖాళీగా లేని పరిస్థితి. ఇలాంటి సమయంలో తప్పకుండా అందరు వాక్సిన్ వేసుకుంటే ఇంకా మంచిది. ఈ సందర్బంగా చారిటబుల్ ట్రస్ట్ వారికీ, సీసీసీ టీంకు, అపోలో వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని అన్నారు.

దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ, ‘కొంతకాలంగా కొనసాగుతున్న వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ఆదివారంలో ముగుస్తుందని, సీసీసీ ద్వారా ఫస్ట్ డోస్ వేసుకున్న ప్రతి ఒక్కరూ రెండో డోస్ వాక్సినేషన్ కూడా వెంటనే వేయించుకోవాల’ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు మెహర్ రమేశ్, చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కూడా పాల్గొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-