జల్లికట్టుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి

కరోనా నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుకు అనుమతిస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా నెగిటివ్ వచ్చిన వారినే అనుమతించాలని, తక్కువ సంఖ్యలో ప్రేక్షకులకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ సూచించారు.

Read Also: రూల్స్‌ బ్రేక్‌ చేస్తున్న ప్రజాప్రతినిధులు

కాగా సంక్రాంతి పండుగలో ఎద్దులను మచ్చిక చేసుకుని లొంగదీసుకునే ఆటే జల్లికట్టు. ఇందుకోసం ఎలాంటి ఆయుధాలను ఉపయోగించకూడదు. కనుమ పండుగ రోజున జల్లికట్టును అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. తమిళనాడులోని మధురై జిల్లాలో ఈనెల 14 నుండి జల్లికట్టు పోటీలు ప్రారంభంకానున్నాయి. మధురైకి దగ్గర్లో ఉన్న అలంగనల్లూరు దగ్గర నిర్వహించే ఈ పోటీలను చూడడానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారు.

Related Articles

Latest Articles