ఇంట్లో ఇల్లాలు.. పార్క్ లో ప్రియురాలు.. కానిస్టేబుల్ కామక్రీడల వీడియో వైరల్

వివాహేతర సంబంధాలకు ఉద్యోగాలతో సంబంధం ఉండడంలేదు.. బాధ్యతయుత పదవిలో ఉండికుండా పరాయి వారి మోజులో కట్టుకున్నవారికి ద్రోహం చేస్తున్నారు. తాజాగా ప్రజలను కాపాడిల్సిన ఒక పోలీస్ ఉద్యోగే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అందరి ముందు పార్కులో ఆమెను ముద్దు పెడుతూ రెచ్చిపోయాడు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో సర్ గారి ఉద్యోగం ఊడిపోయింది. పరాయి మహిళపై మోజు.. ఉద్యోగాన్ని పోగొట్టింది. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. కోయంబత్తూర్‌లో సాయుధ రిజర్వ్ పోలీసు విభాగానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి ఏడాది క్రితమే వివాహమైంది. మంచి ఉద్యోగం, భార్య.. సంతోషంగా ఉన్న అతని జీవితంలోకి రెండు నెలల క్రితం ఒక యువతి ప్రవేశించింది. వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. భార్యకు తెలియకుండా ఆమెను పార్క్ లో కలుస్తూ ఉండేవాడు బాలాజీ. ఇటీవల కూడా పార్క్ కి వెళ్లిన బాలాజీ ఒంటి మీద యూనిఫామ్ ఉందని కూడా పట్టించుకోకుండా పార్కులోనే ప్రియురాలితో రాసలీలలు మొదలుపెట్టాడు. దీనిని అక్కడ ఉన్న కొంతమంది యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఇక దీంతో బాలాజీపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బాలాజీని విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీచేశారు.

Related Articles

Latest Articles