అలా చేయ‌డం మంచిది కాదు… ప్ర‌ధానికి లేఖ రాస్తా…

కేంద్రం ప్ర‌భుత్వ ఆస్తుల‌ను విక్ర‌యించ‌డం లేదా లీజుకు ఇవ్వడం వంటివి చేయ‌డం మంచిది కాద‌ని దీనిపై ప్ర‌ధాని మోడికీ లేఖ రాస్తాన‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ పేర్కొన్నారు.  కేంద్రం అనుస‌రిస్తున్న నేష‌న‌ల్ మానిటైజేష‌న్ పైపులైన్ విధానంపై ఆయ‌న ఈరోజు విమ‌ర్శ‌లు చేశారు.  దేశంలోని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు ప్ర‌జా ఆస్తుల‌ని, అవి దేశ భ‌విష్య‌త్తుకు, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల క‌ల్ప‌న కోసం ఏర్పాటు చేశార‌ని, వాటిని అమ్మ‌డం లేదా లీజుకు ఇవ్వ‌డం వంటిది దేశ‌ప్ర‌యోజ‌నాల‌కు మంచిది కాద‌ని స్టాలిన్ ఈరోజు అసెంబ్లీలో పేర్కొన్నారు.  దేశంలోని ప్ర‌భుత్వరంగ సంస్థ‌లు విశాల‌మైన ప్ర‌యోజ‌నాలు దృష్టిలో పెట్టుకొని ప‌నిచేస్తాయ‌ని, అంతేగాని, వ్యాపార దృక్ప‌దంతో ప‌నిచేయ‌వ‌ని అన్నారు.  దీనిపై విపులంగా ప్ర‌ధాని మోడికి లేఖ రాస్తాన‌ని ముఖ్య‌మంత్రి స్టాలిన్ పేర్కొన్నారు.  

Read: 9 మంది నేత‌ల‌తో కాంగ్రెస్ కీల‌క క‌మిటీ… దేనికంటే…

Related Articles

Latest Articles

-Advertisement-